POCO X6 Neo 5G: 108MP డ్యూయల్ కెమేరాతో వచ్చింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

Updated on 13-Mar-2024
HIGHLIGHTS

లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ POCO X6 Neo 5G ఈరోజు రిలీజ్ అయ్యింది.

120Hz AMOLED డిస్ప్లే వంటి ఆకర్షణీయమైం ఫీచర్స్ తో తీసుకు వచ్చింది

15 వేల రూపాయల ధరలో 108MP డ్యూయల్ కెమేరాతో వచ్చింది

POCO X6 Neo 5G: పోకో బ్రాండ్ నుండి లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పోకో X6 నియో 5G ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం 15 వేల రూపాయల ప్రారంభ ధరలో 108MP డ్యూయల్ కెమేరా మరియు 120Hz AMOLED డిస్ప్లే వంటి ఆకర్షణీయమైం ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అర్లీ యాక్సెస్ సేల్ కూడా ఈరోజు సాయంత్రం 7 గంటల నుండే మొదలువుతుంది. మరి ఈరోజే మార్కెట్ లో అడుగు పెట్టిన ఈ లేటెస్ట్ పోకో 5జి స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.

POCO X6 Neo 5G: Price

పోకో ఈ ఎక్స్ 6 నియో స్మార్ట్ ఫోన్ ను రూ. 15,999 ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ యొక్క (8GB + 128GB) వేరియంట్ ను ఈ రేటుతో అందించింది. ఈ ఫోన్ యొక్క (12GB + 256GB) వేరియంట్ ను కేవలం రూ. 17,999 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల ICICI బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ మరియు రూ. 1,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను అందించింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు 7 గంటల నుండి Early Access Sale కి అందుబాటులోకి వస్తుంది. ఈ పోకో కొత్త ఫోన్ ఆస్ట్రల్ బ్లాక్, హరీజోన్ బ్లూ మరియు మార్టియన్ ఆరంజ్ అనే మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Also Read: ధమాకా ఆఫర్: డ్యూయల్ సబ్ ఉఫర్ Soundbar పైన గొప్ప డిస్కౌంట్ అందుకోండి.!

POCO X6 Neo 5G: Specs

పోకో ఎక్స్ 6 నియో 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం 7.69mm మందంతో పర్ఫెక్ట్ స్లీక్ డిజైన్ తో తీసుకు వచ్చింది. ఈ పోకో ఫోన్ లో 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో ఉంటుంది. పోకో ఈ ఫోన్ ను ,మీడియాటెక్ Dimensity 6080 5G ప్రోసెసర్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ 8GB / 12GB RAM మరియు 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లలో లభిస్తుంది.

పోకో ఎక్స్ 6 నియో 5జి ఫోన్ లో వెనుక 108MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా సెటప్ వుంది. ఈ ఫోన్ ఫ్రెంట్ మరియు బ్యాక్ కెమేరాతో 1080p (at 30 fps) వీడియోలను షూట్ చేసే వీలుంది. ఈ పోకో ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని కలిగి వుంది.

ఈ ఫోన్ ను పోకో MIUI 14 సాఫ్ట్ వేర్ తో Android 13 OS తో అందించింది. ఈ ఫోన్ లో మోనో స్పీకర్ ఉన్నా దాన్ని Dolby Atmos సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :