POCO X6 5G: తక్కువ ధరలో 1.5K Dolby Vision డిస్ప్లే వంటి భారీ ఫీచర్లతో వచ్చింది.!

POCO X6 5G: తక్కువ ధరలో 1.5K Dolby Vision డిస్ప్లే వంటి భారీ ఫీచర్లతో వచ్చింది.!
HIGHLIGHTS

పోకో ఎక్స్6 సిరీస్ ను ఈరోజు లాంచ్ చేసింది

POCO X6 5G తక్కువ ధరలో భారీ ఫీచర్లతో వచ్చింది

ఈరోజు నుండే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క Pre Orders మొదలు పెట్టింది

పోకో చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న పోకో ఎక్స్6 సిరీస్ ను ఈరోజు లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుండి POCO X6 5G స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో 1.5K Dolby Vision డిస్ప్లే వంటి భారీ ఫీచర్లతో వచ్చింది. పోకో ఎక్స్6 5జి స్మార్ట్ ఫోన్ ను గొప్ప బ్యాంక్ ఆఫర్లతో కూడా కంపెనీ విడుదల చేసింది. అంతేకాదు, ఈరోజు నుండే ఈ స్మార్ట్ ఫైన్ యొక్క Pre Orders ను కూడా కంపెనీ మొదలు పెట్టింది.

POCO X6 5G Price

పోకో ఎక్స్6 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB+ 256GB) ని రూ. 21,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, పోకో ఎక్స్6 5జి యొక్క హై ఎండ్ వేరియంట్ (12GB+ 512GB) ని రూ. 24,999 ధరతో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను జతచేసింది. ఈ ఆఫర్ HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ & డెబిట్ తో ఈ ఫోన్ ను కొనేవారికి మాత్రమే అందిస్తోంది. ప్రొకో ఎక్స్6 5జి స్మార్ట్ ఫోన్ ఈ రోజు నుండి Pre Orders కి అందుబాటులోకి వచ్చింది.

Also Read : Flipkart Sale కంటే ముందే బిగ్ డీల్: 23 వేలకే పెద్ద QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!

పోకో ఎక్స్6 5జి ప్రత్యేకతలు

పోకో ఎక్స్6 5జి స్మార్ట్ ఫోన్ అద్భుతమైన డిస్ప్లేతో వచ్చింది. ఎందుకంటే, కంపెనీ తెలిపిన ప్రకారం ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ (2712 x 1220) కలిగిన AMOLED డిస్ప్లేని 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే 68.7 బిలియన్స్ కలర్ లకు సపోర్ట్ మరియు Dolby Vision సపోర్ట్ ను కూడా కలిగి ఉందని కూడా రియల్ మి తెలిపింది.

poco x6 5g with Dolby vision display features

అంతేకాదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా వుంది. ఈ ధర పరిధిలో ఈ డిస్ప్లే తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుందని కూడా రియల్ మి గొప్పగా చెబుతోంది. ఈ కొత్త ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ప్రోసెసర్ Snapdragon 7s Gen 2 తో లాంచ్ చేసింది. దీనికి తోడు 12GB RAM మరియు 512GB స్టోరేజ్ లను జత చేసింది. ఈ ఫోన్ Android 13 OS పైన పని చేస్తుంది.

ఈ పోకో ఫోన్ లో వెనుక 64MP OIS + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ ఫోన్ కెమేరాతో 4K వీడియోలను 30 fps వద్ద రికార్డ్ చేయవచ్చు. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ పోకో ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo