Poco M7 Pro లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన పోకో.!

Updated on 04-Dec-2024
HIGHLIGHTS

Poco M7 Pro ఇండియా లాంచ్ డేట్ ను పోకో అనౌన్స్ చేసింది

పోకో M సిరీస్ నుంచి మరొక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తోంది

ఈ ఫోన్ డిజైన్ ను తెలియచేసే ఇమేజ్ ను కూడా విడుదల చేసింది

Poco M7 Pro ఇండియా లాంచ్ డేట్ ను పోకో అనౌన్స్ చేసింది. పోకో M సిరీస్ నుంచి ఇప్పటికే చాలా సక్సెస్ ఫుల్ స్మార్ట్ ఫోన్ లను అందించిన పోకో ఇప్పుడు మరొక స్మార్ట్ ఫోన్ ను కూడా విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు అంచనా ఫీచర్స్ తెలుసుకుందామా.

Poco M7 Pro : లాంచ్

పోకో ప కమింగ్ స్మార్ట్ ఫోన్ M7 Pro ను డిసెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్మెంట్ తో పాటు ఈ ఫోన్ డిజైన్ ను తెలియ చేసే ఇమేజ్ ను కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో టీజింగ్ చేస్తోంది.

Poco M7 Pro : అంచనా ఫీచర్స్

పోకో అప్ కేమయింగ్ స్మార్ట్ ఫోన్ M7 Pro ఈ సెగ్మెంట్ లో అత్యంత ప్రకాశవంతమైన AMOLED స్క్రీన్ కలిగిన ఫోన్ అవుతుందని పోకో చెబుతోంది. అంటే, ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అధిక బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే కలిగి ఉంటుంది.ఈ ఫోన్ లో 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన GOLED స్క్రీన్ ఉంటుంది మరియు ఇది HDR 10+ సపోర్ట్ ని కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో అందించిన స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ విబువరాలి మాత్రమే ప్రస్తుతానికి కంపెనీ అనౌన్స్ చేసింది. అయితే, ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క మరిన్ని ఇతర వివరాలు కూడా తెలియ వచ్చాయి.

Also Read: SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ ప్రకటించిన అమెజాన్.!

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. అలాగే, ఈ ఫోన్ లో టైప్ C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు డిఫరెంట్ కలర్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :