Poco M7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ను స్టైలిష్ డిజైన్ మరియు Sony 50MP కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో పోకో విడుదల చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్ పోకో తీసుకు వచ్చిన ఈ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
పోకో ఎం7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 6GB + 128GB బేసిక్ వేరియంట్ ను రూ. 13,999 రూపాయల ధరకు లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ యొక్క 8GB + 256GB హైఎండ్ వేరియంట్ ను రూ. 15,999 లాంచ్ ఆఫర్ ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
పోకో ఎం7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను HDR 10+ సపోర్ట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగిన oLED డిస్ప్లేతో అందించింది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 7025 Ultra చిప్ సెట్ తో వచ్చింది. ఈ చిప్సెట్ తో జతగా 8GB ఫిజికల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony-LYT) మెయిన్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ను కలిగి వుంది. ఈ రియర్ కెమెరా OIS మరియు EIS సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 20MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 2X ISZ+ సూపర్ రిజల్యూషన్ అల్గారిథం తో గొప్ప ఫోటోలు అందిస్తుందని పోకో తెలిపింది.
Also Read: Google Pixel 8a పై ఫ్లిప్ కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!
ఇక ఇతర ఫీచర్స్ విషయూన్ని వస్తే, ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి వుంది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5110 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.