Poco M7 Pro 5G స్టైలిష్ డిజైన్ మరియు Sony 50MP కెమెరాతో వచ్చింది.!

Poco M7 Pro 5G స్టైలిష్ డిజైన్ మరియు Sony 50MP కెమెరాతో వచ్చింది.!
HIGHLIGHTS

Poco M7 Pro 5G ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది.

Sony 50MP కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో పోకో విడుదల చేసింది

ఈ ఫోన్ Dimensity 7025 Ultra చిప్ సెట్ తో వచ్చింది

Poco M7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ను స్టైలిష్ డిజైన్ మరియు Sony 50MP కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో పోకో విడుదల చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ లో ఆకట్టుకునే ఫీచర్ పోకో తీసుకు వచ్చిన ఈ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Poco M7 Pro 5G : ధర

పోకో ఎం7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ 6GB + 128GB బేసిక్ వేరియంట్ ను రూ. 13,999 రూపాయల ధరకు లాంచ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ యొక్క 8GB + 256GB హైఎండ్ వేరియంట్ ను రూ. 15,999 లాంచ్ ఆఫర్ ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Poco M7 Pro 5G : ఫీచర్స్

పోకో ఎం7 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను HDR 10+ సపోర్ట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగిన oLED డిస్ప్లేతో అందించింది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 7025 Ultra చిప్ సెట్ తో వచ్చింది. ఈ చిప్సెట్ తో జతగా 8GB ఫిజికల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. 

Poco M7 Pro 5G Features

ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony-LYT) మెయిన్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ను కలిగి వుంది. ఈ రియర్ కెమెరా OIS మరియు EIS సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 20MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 2X ISZ+ సూపర్ రిజల్యూషన్ అల్గారిథం తో గొప్ప ఫోటోలు అందిస్తుందని పోకో తెలిపింది.

Also Read: Google Pixel 8a పై ఫ్లిప్ కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!

ఇక ఇతర ఫీచర్స్ విషయూన్ని వస్తే, ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి వుంది. ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5110 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo