Poco M6 స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 108MP కెమెరా మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ ఫీచర్స్ మరియు ప్రైస్ వివరాలు కూడా పోకో వెల్లడించింది.
పోకో ఎం6 స్మార్ట్ ఫోన్ రేపు, అంటే జూన్ 11న గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ లలో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ను $ 129 (సుమారు రూ. 10,800) ధరతో మరియు 8GB + 256GB వేరియంట్ ను $ 149 (సుమారు రూ. 12,500) ధరతో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.
పోకో ఎం 6 స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ ఫాస్ట్ 4G ప్రోసెసర్ Helio G91 Ultra తో లాంచ్ చేస్తోంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ లో 6.79 ఇంచ్ బిగ్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ పోకో అప్ కమింగ్ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఉంటుంది మరియు ఈ ఫోన్ Xiaomi Hyper OS తో వస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక 108MP సూపర్ క్లియర్ మెయిన్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. పోకో ఎం 6 సెల్ఫీ మరియు రియర్ కెమెరాతో 1080p వీడియోలు షూట్ చేసే అవకాశం వుంది.
Also Read: Motorola Edge 50 ultra: మోటో AI మరియు సినిమాటిక్ స్క్రీన్ వంటి జబర్దస్త్ ఫీచర్స్ తో వస్తోంది.!
ఈ ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5030 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్ ను బ్లాక్, పర్పుల్ మరియు సిల్వర్ మూడు కలర్ ఆప్షన్ లలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ మరియు డ్యూయల్ టోన్ కలర్ తో ఆకట్టుకుంటోంది.