Poco M6 Plus స్మార్ట్ ఫోన్ 108MP కెమెరా తో ఆగస్టు 1 న విడుదల అవుతుంది.!
Poco M6 Plus స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది కంపెనీ
ఈ ఫోన్ ను 108MP కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదల చేయబోతున్నట్లు పోకో తెలిపింది
ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది
Poco M6 Plus స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది కంపెనీ. ఈ స్మార్ట్ ఫోన్ ను 108MP కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదల చేయబోతున్నట్లు పోకో తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ను కంపెనీ అనౌన్స్ చేసింది. పోకో బడ్జెట్ సిరీస్ గా పేరొందిన M సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుంది కాబట్టి, ఈ ఫోన్ ను కూడా బడ్జెట్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది.
Poco M6 Plus : లాంచ్
పోకో ఎం 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 1 వ తేదీన ఇండియాలో విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజిని అందించింది మరియు ఈ పేజీ నుండి టీజింగ్ కూడా చేస్తోంది. ఇందులో ఈ అప్ కమింగ్ పోకో ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లు అందించింది.
Poco M6 Plus : ఫీచర్లు
పోకో ఎం 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ స్లీక్ మరియు రౌండ్ కార్నర్ డిజైన్ తో వుంది. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ కలర్ లలో వస్తుంది. M6 ప్లస్ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 108MP మెయిన్ కెమెరా ఉందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ కెమెరా 3x ఇన్ సెన్సార్ జూమ్ తో గొప్ప ఫోటోలు అందిస్తుందని కూడా పోకో చెబుతోంది.
ఈ ఫోన్ సన్నని బెజెల్ కలిగిన పెద్ద డిస్ప్లే తో వస్తుంది. వెలుగు లేనప్పుడు అతిగా బ్రైట్నెస్ అందించకుండా చూసుకునే Auto Night Mode సపోర్ట్ తో ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ సెంటర్ పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో పైన IR బ్లాస్టర్ ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే, ఈ ఫోన్ కెమెరా సెటప్ తో రింగ్ LED ఫ్లాష్ లైట్ కూడా వుంది.
Also Read: Nothing Phone (2a) Plus: 20GB ర్యామ్ మరియు సరికొత్త చిప్ సెట్ తో వస్తుంది.!
ఇప్పటి వరకు ఈ వివరాలు మాత్రమే కంపెనీ అందించింది. అయితే, పోకో ఎం 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్, 8GB వరకు ర్యామ్ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5030 బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో వస్తుందని కొంతమంది లీక్ స్టర్స్ చెబుతున్నారు. అయితే, పోకో ఈ ఫోన్ వివరాలు వెల్లడించిన తరువాత చూడాలి ఈ మాటల్లో ఎంత నిజం ఉందో అని.