Exclusive: 12 వేల ధరలో 108MP కెమెరాతో Poco M6 Plus 5G లాంచ్.!

Exclusive: 12 వేల ధరలో 108MP కెమెరాతో Poco M6 Plus 5G లాంచ్.!
HIGHLIGHTS

పోకో M6 సిరీస్ నుంచి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత మార్కెట్లో లాంచ్

ఈ కొత్త 5జి ఫోన్ ఫాస్ట్ ప్రొసెసర్ వంటి మరిన్ని ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో వచ్చింది

పోకో ఎం 6 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పైన ఒక లుక్కేయండి

Poco M6 Plus 5G: పోకో M6 సిరీస్ నుంచి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత మార్కెట్లో 4 గంటలకు లాంచ్ అవుతుంది. అయితే, ఈ కొత్త 5జి ఫోన్ ని ఫీచర్స్ తో పాటు ధర వివరాలను కూడా డిజిట్ తెలుగు ఈ ఫోన్ వివరాలను ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. ఈ ఫోన్ 108MP కెమెరా మరియు లేటెస్ట్ ఫాస్ట్ ప్రొసెసర్ వంటి మరిన్ని ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో ఈరోజు ఇండియాలో విడుదల అవుతుంది. ఈరోజు సాయంత్రం విడుదలకాబోతున్న పోకో ఎం 6 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పైన ఒక లుక్కేద్దాం పదండి.

Poco M6 Plus 5G: ధర

పోకో ఎం 6 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 11,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ అయిన 6GB + 128GB కోసం ఈ రేటు ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ను రూ. 13,499 ధరతో ప్రకటించింది. ఈ ఫోన్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు అవ్వనుండగా, డిజిట్ తెలుగు ఈ ఫోన్ వివరాలను ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ డాల్బీ డిజిటల్ QLED Smart Tv

Poco M6 Plus 5G: ఫీచర్స్

పోకో ఎం 6 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ 6.79 ఇంచ్ LCD డిస్ప్లే తో వచ్చింది. ఈ స్క్రీన్ 30-120 అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 2 AE చిప్ సెట్ కి జతగా 6GB /8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ మిస్టీ లావెండర్, ఐస్ సిల్వర్ మరియు గ్రాఫైట్ బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

Poco M6 Plus 5G Features

ఎం 6 ప్లస్ 5జి ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 108MP ప్రధాన కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ కెమెరా 3x ఇన్ సెన్సార్ జూమ్, స్మార్ట్ నైట్ మోడ్ మరియు HDR వంటి చాలా కెమెరా ఫీచర్స్ ను కలిగి వుంది. ఈ ఫోన్ షియోమీ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ Hyper OS తో ఆండ్రాయిడ్ 14 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5030 బ్యాటరీ వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo