Poco X7 Series 5G ను ఇండియాలో లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ సిరీస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు కన్ఫర్మ్ కూడా చేసింది. పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి పోకో ఎక్స్ 7 5జి మరియు పోకో ఎక్స్ 7 ప్రో 5జి రెండు ఫోన్లు లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ మరియు ఇతర వివరాల పై ఒక లుక్కేద్దామా.
పోకో ఎక్స్ 7 సిరీస్ ని జనవరి 9వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న రెండు ఫోన్ల డిజైన్ మరియు ఇతర ఫీచర్స్ తెలియ చేసే టీజింగ్ ఇమేజ్ లను షేర్ కూడా చేసింది. ఈ సిరీస్ లాంచ్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది.
ఈ అప్ కమింగ్ సిరీస్ నుంచి పోకో ఎక్స్ 7 5జి మరియు ఎక్స్ 7 ప్రో 5జి రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. వీటిలో, పోకో ఎక్స్ 7 ఫోన్ ను ‘Xceed Your Limits’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేస్తోంది మరియు పోకో ఎక్స్ 7 ప్రో 5జి ఫోన్ ను ‘Xceed All Limits’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేస్తోంది.
ఈ సిరీస్ నుంచి లాంచ్ కాబోతున్న ఎక్స్ 7 5జి ఫోన్ ను 50MP OIS ట్రిపుల్ రియర్ కెమెరాతో లాంచ్ చేస్తోంది. అయితే, ఎక్స్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను 50MP OIS డ్యూయల్ రియర్ కెమెరాతో అందిస్తున్నట్లు క్లియర్ అయ్యింది. ఈ రెండు ఫోన్స్ టీజర్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.
Also Read: Fake Photos గుర్తించడానికి వీలుగా కొత్త ఫీచర్ అందిస్తున్న WhatsApp.!
ఈ అప్ కమింగ్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఈ రెండు ఫోన్ లను బ్లాక్ మరియు ఎల్లో డ్యూయల్ కలర్ టోన్ డిజైన్ తో లాంచ్ చేస్తుంది. ఈ సరికొత్త మిక్స్ కలర్ డిజైన్ లో ఈ ఫోన్ చూడటానికి ముచ్చటగా కనిపిస్తోంది. ఈ రెండు ఫోన్స్ కూడా లెథర్ డిజైన్ తో కనిపిస్తున్నాయి. ఈ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ అప్డేట్ ను త్వరలోనే అందించే అవకాశం వుంది.