POCO X7 5G స్మార్ట్ ఫోన్ ను 1.5K 3D కర్వ్డ్ డిస్ప్లేతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన పోకో.!
Poco X7 5G స్మార్ట్ ఫోన్ రోజు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేయబడింది
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను 1.5K 3D కర్వ్డ్ డిస్ప్లేతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది
ఈ ఫోన్ IP69 రేటింగ్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ రక్షణతో చాలా దృఢంగా ఉంటుంది
Poco X7 5G స్మార్ట్ ఫోన్ రోజు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేయబడింది. ఒక ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను 1.5K 3D కర్వ్డ్ డిస్ప్లేతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. కేవలం డిస్ప్లే మాత్రమే కాదు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్, కెమెరా మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ ఆకట్టుకుంటుంది.
POCO X7 5G : ధర
పోకో ఎక్స్ 7 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 21,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క (8GB + 128GB) వేరియంట్ ను ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) రూ. 23,999 ధరతో విడుదలయ్యింది. ఈ ఫోన్ పై ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ లేదా ఎక్స్ చేంజ్ పై రూ. 2,000 డిస్కౌంట్ లలో ఒక ఆఫర్ ని అందుకునే అవకాశం అందించింది.
పోకో ఎక్స్ 7 5జి స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ జనవరి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ Flipkart నుంచి సేల్ అవుతుంది మరియు మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
Also Read: Poco X7 Pro 5G మిడ్ రేంజ్ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
POCO X7 5G : ఫీచర్స్
పోకో ఎక్స్ 7 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, Dolby Vision సపోర్ట్, HDR 10+ సపోర్ట్, వెట్ టచ్ డిస్ప్లే మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ రక్షణతో చాలా దృఢంగా ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 Ultra చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ తో పాటు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ పోకో కొత్త ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP Sony LYT-600 మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 20MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 30fps వద్ద 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు AI Night Mode ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీని 45W టర్బో ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.