అతి చవక ధరకే Poco C75 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన పోకో.!

Updated on 17-Dec-2024

Poco C75 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు పోకో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరలో విడుదల చేసింది మరియు ఈ బడ్జెట్ లో ఆకట్టుకునే ఫీచర్ లను కూడా ఈ ఫోన్ లో జత చేసింది. పోకో సరికొత్తగా లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్లు మరియు ధర తెలుసుకోండి.

Poco C75 5G: ధర

పోకో సి 75 ఫోన్ ను లిమిటెడ్ పిరియడ్ అఫర్ లో భాగంగా రూ. 7,999 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిసెంబర్ 19 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ Flipkart మరియు realme.com నుంచి లభిస్తుంది.

Poco C75 5G: ఫీచర్స్

పోకో సి 75 స్మార్ట్ ఫోన్ ను 6.88 ఇంచ్ HD+ (1640×720) స్క్రీన్ ని కలిగి వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు వాటర్ డ్రాప్ డిజైన్ ను కలిగి ఉంటుంది. పోకో ఈ C75 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 4s Gen 2 చిప్ సెట్ తో అందించింది. ఈ చిప్ సెట్ కి జతగా 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందించింది.

పోకో సి 75 ఫోన్ లో వెనుక 50MP Sony మెయిన్ కెమెరా మరియు డెప్త్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఈ ఫోన్ లో ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 1080P వీడియోలు 30fps వద్ద షూట్ చేయగలదు మరియు డీటెయిల్ ఫోటోలు అందించగలదు అని పోకో తెలిపింది.

Also Read: Poco M7 Pro 5G స్టైలిష్ డిజైన్ మరియు Sony 50MP కెమెరాతో వచ్చింది.!

పోకో ఈ ఫోన్ ను 5160 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ లో 10W ఛార్జర్ ను మాత్రమే అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS పై నడుస్తుంది మరియు 2 మేజర్ OS అప్డేట్ తో పాటు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :