Poco F7 Pro 5G image and features leaked on internet
Poco F7 Pro 5G స్మార్ట్ ఫోన్ యొక్క ఇమేజే మరియు ఈ ఫోన్ యొక్క కొన్ని వివరాలు ఇప్పుడు నెట్టింట్లో లీక్ అయ్యాయి. పోకో ఎఫ్6 సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్ సిరీస్ గ రానున్న పోకో ఎఫ్7 5జి స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ లేదా ఇతరాలు కంపెనీ నుంచి రిలీజ్ కావడానికి ముందే ఈ ఫోన్ యొక్క వివరాలు నెట్టింట్లో కనిపించాయి. ఈ ఫోన్ గొప్ప డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చే అవకాశం ఉందని ఈ లీక్డ్ ఫీచర్స్ వెల్లడిస్తున్నాయి.
పోకో అప్ కమింగ్ ఫోన్ F7 ప్రో స్మార్ట్ ఫోన్ సిరీస్ ను మార్చి నెల చివరి నాటికి, అంటే మార్చి 27న లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ అప్ కేమయింగ్ సిరీస్ ముక్కుని పోకో ఎఫ్ 7 ప్రో తో పాటు Poco F7 Ultra ఫోన్ ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంటుందని కూడా అంచనా చెబుతున్నారు. అయితే, పోకో నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన లేదు.
పోకో ఎఫ్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ 1.5 రిజల్యూషన్ కలిగిన AMOLED స్క్రీన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ ను Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో అందించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కాకుండా ఇందులో 12GB LPDDR5 ర్యామ్ మరియు 512 UFS 4.1 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండవచ్చు.
ఈ పోకో అప్ కమింగ్ సార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను 60fps తో 4K వీడియో షూట్ చేసే ఫీచర్ తో అందించే అవకాశం ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండవచ్చు. ఈ ఫోన్ 6000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో రావచ్చని భావిస్తున్నారు.
Also Read: అమెజాన్ మెగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్ నుంచి Sony Soundbar పై బిగ్ డీల్స్ అందుకోండి.!
అంతేకాదు, ఈ ఫోన్ ను యూరప్ మార్కెట్లో €599 (సుమారు రూ.57,000) ధరతో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. మరి ఈ ఫోన్ అప్డేట్ ను ఎప్పుడు కంపెనీ అధికారికంగా విడుదల చేస్తుందో చూడాలి.
Note: పైన అందించిన ఇమేజ్ పోకో ఎఫ్ 7 ప్రో 5జి డి కాదని గమనించాలి.