భారీ ఆఫర్లతో మొదలైన Poco F6 5G స్మార్ట్ ఫోన్ సేల్.!

భారీ ఆఫర్లతో మొదలైన Poco F6 5G స్మార్ట్ ఫోన్ సేల్.!
HIGHLIGHTS

Poco F6 5 సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది

ఈరోజు మొదటి రోజు సేల్ కావడంతో ఈ ఫోన్ పై భారీ ఆఫర్లను అందించింది

రూ. 5,000 రూపాయల వరకూ డిస్కౌంట్ లను అందుకునే అవకాశం

ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదలైన పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Poco F6 5G సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈరోజు మొదటి రోజు సేల్ కావడంతో ఈరోజు ఈ ఫోన్ పై భారీ ఆఫర్లను అందించింది. ఈ సేల్ నుండి ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల వరకూ డిస్కౌంట్ లను అందుకునే అవకాశం ఈరోజు కొనుగోలుదారులకు లభిస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఈ ఫోన్ పైన ఈరోజు లభిస్తున్న ఆఫర్లు, ఫోన్ ధర మరియు ఫీచర్లు అన్ని వివరాల పైన ఒక లుక్కేద్దాం పదండి.

Poco F6 5G : ఆఫర్లు

పోకో F6 5జి స్మార్ ఫోన్ పైన ఈరోజు బ్యాంక్ మరియు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ లు లభిస్తున్నాయి. ఈ ఫోన్ ను SBI, ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో ఈరోజు కొనుగోలు చేసే వారికి రూ. 2,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక రెండవ ఆఫర్ అయిన ఎక్స్ చేంజ్ బోనస్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పైన రూ. 3,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను యూజర్లు అందుకోవచ్చు.

అంటే, ఈ ఫోన్ ను ఈ రోజు ఈ రెండు ఆఫర్లతో రూ. 5,000 రూపాయల డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ ధర వివరాలు ఇక్కడ చూడవచ్చు.

పోకో F6 5జి (8GB + 256GB) ధర : రూ. 29,999

పోకో F6 5జి (12GB + 256GB) ధర : రూ. 31,999

పోకో F6 5జి (12GB + 512GB) ధర : రూ. 33,999

ఈ స్మార్ట్ ఫోన్ ను Flipkart నుండి పైన తెలిపిన ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఇక నుండి సర్వీస్ ఇన్ కమింగ్ కాల్స్ కోసం కొత్త 160 యూనిఫామ్ నెంబర్ మాత్రమే ఉంటుంది.!

Poco F6 5G : ప్రత్యేకతల

పోకో F6 5జి ప్రత్యేకతలు మరియు ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ ను 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. ఇది 1.5K రిజల్యూషన్, Dolby Vision సపోర్ట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 ప్రోసెసర్ కి జతగా 12GB LPDDR5X RAM మరియు 512 GB హెవీ స్టోరేజ్ సపోర్ట్ గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Poco F6 5G features
Poco F6 5G features

ఈ ఫోన్ లో 30fps వద్ద HDR 10+ 4K వీడియోలను మరియు 60 fps వద్ద 4K UHD వీడియోలను షూట్ చేయగల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది, ఇందులో 50MP (OIS) మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ లు ఉన్నాయి. అలాగే, ముందు 20MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ HyperOS ఫాస్ట్ వేర్ తో Android 14OS పై నడుస్తుంది.

ఈ పోకో ఫోన్ లో 90W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ ఫోన్ ను IP64 రేటింగ్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo