Poco F6 5G: పోకో ప్రీమియం సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ను భారీ సెటప్ తో లాంచ్ చేయనున్నట్లు కనిపిస్తోంది. మొన్న ఈ ఫోన్ లాంచ్ డేట్ ను ప్రకటించిన కంపెనీ నిన్న ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ వివరాలు అందించింది. పోకో ఎఫ్ 6 ఫోన్ ను లేటెస్ట్ Snapdragon చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసి, ఈ ఫోన్ పైన అంచనాలను పెంచింది.
పోకో ఈ ఫోన్ ను మే 23వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఇండియాలో మే 23వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ను గత సంవత్సరం పోకో అందించి పోకో F5 5G స్మార్ట్ ఫోన్ తరువాతి తరం ఫోన్ గా తీసుకు వస్తుంది.
పోకో F6 5G స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ గా అందించిన Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కానర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ప్రోసెసర్ 1.5 MN+ AnTuTu స్కోర్ ను కలిగి ఉన్నట్లు కూడా తెలిపింది. ఇది 4nm ఫ్యాబ్రికేషన్ ప్రోసెసర్ మరియు X 4 ఫ్లాగ్ షిప్ కోర్ తో ఉంటుంది.
ఈ ప్రోసెసర్ ఇమేజ్ ఆర్కిటెక్చర్, డిస్ప్లే ఆర్కిటెక్చర్, మెమొరీ ఆర్కిటెక్చర్ మరియు మోడెమ్ ఆర్కిటెక్చర్ కలయికగా ఉంటుంది. అనే వివరాలను కూడా టీజర్ ఇమేజ్ లో అందించింది. అంటే, ఈ ఫోన్ కలిగి ఉండనున్న ఇతర ఫీచర్స్ గురించి కూడా హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
Also Read: Realme GT 6T: 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!
అంటే, ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే, కెమెరా మరియు ర్యామ్ సపోర్టులను అందిస్తుందని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో 50MP OIS మైన కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా మరియు డ్యూయల్ LED ఫ్లాష్ ను ప్రత్యేకమైన రింగ్ డిజైన్ లో అందించింది. ఈ ఫోన్ మరిన్ని వివరాలు త్వరలోనే మనం చూసే అవకాశం వుంది.