Poco F6 5G: లేటెస్ట్ Snapdragon చిప్ సెట్ తో లాంచ్ కన్ఫర్మ్ చేసిన పోకో.!

Poco F6 5G: లేటెస్ట్ Snapdragon చిప్ సెట్ తో లాంచ్ కన్ఫర్మ్ చేసిన పోకో.!
HIGHLIGHTS

పోకో ప్రీమియం సిరీస్ నుండి కొత్త ఫోన్ ను భారీ సెటప్ తో లాంచ్ చేయనున్నట్లు కనిపిస్తోంది

Poco F6 5G ను లేటెస్ట్ Snapdragon చిప్ సెట్ తో లాంచ్ చేసినట్లు కన్ఫర్మ్

పోకో ఈ ఫోన్ ను మే 23వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది.

Poco F6 5G: పోకో ప్రీమియం సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ను భారీ సెటప్ తో లాంచ్ చేయనున్నట్లు కనిపిస్తోంది. మొన్న ఈ ఫోన్ లాంచ్ డేట్ ను ప్రకటించిన కంపెనీ నిన్న ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ వివరాలు అందించింది. పోకో ఎఫ్ 6 ఫోన్ ను లేటెస్ట్ Snapdragon చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసి, ఈ ఫోన్ పైన అంచనాలను పెంచింది.

Poco F6 5G Launch

పోకో ఈ ఫోన్ ను మే 23వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఇండియాలో మే 23వ తేదీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ను గత సంవత్సరం పోకో అందించి పోకో F5 5G స్మార్ట్ ఫోన్ తరువాతి తరం ఫోన్ గా తీసుకు వస్తుంది.

ఏమిటి ఆ లేటెస్ట్ Snapdragon చిప్ సెట్?

పోకో F6 5G స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ గా అందించిన Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కానర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ప్రోసెసర్ 1.5 MN+ AnTuTu స్కోర్ ను కలిగి ఉన్నట్లు కూడా తెలిపింది. ఇది 4nm ఫ్యాబ్రికేషన్ ప్రోసెసర్ మరియు X 4 ఫ్లాగ్ షిప్ కోర్ తో ఉంటుంది.

Poco F6 5G Processor
Poco F6 5G Processor

ఈ ప్రోసెసర్ ఇమేజ్ ఆర్కిటెక్చర్, డిస్ప్లే ఆర్కిటెక్చర్, మెమొరీ ఆర్కిటెక్చర్ మరియు మోడెమ్ ఆర్కిటెక్చర్ కలయికగా ఉంటుంది. అనే వివరాలను కూడా టీజర్ ఇమేజ్ లో అందించింది. అంటే, ఈ ఫోన్ కలిగి ఉండనున్న ఇతర ఫీచర్స్ గురించి కూడా హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.

Also Read: Realme GT 6T: 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!

అంటే, ఈ ఫోన్ లో గొప్ప డిస్ప్లే, కెమెరా మరియు ర్యామ్ సపోర్టులను అందిస్తుందని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో 50MP OIS మైన కెమెరా కలిగిన డ్యూయల్ కెమెరా మరియు డ్యూయల్ LED ఫ్లాష్ ను ప్రత్యేకమైన రింగ్ డిజైన్ లో అందించింది. ఈ ఫోన్ మరిన్ని వివరాలు త్వరలోనే మనం చూసే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo