Poco F6 5G: పోకో ఈరోజు తన ప్రీమియం సిరీస్ నుండి పోకో F6 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఇతర ఫీచర్ లతో విడుదల చేసింది. ఈ ఫోన్ ను సెగ్మెంట్ లో మార్కెట్ లో గొప్ప పోటీదారుగా తీసుకు వచ్చింది. రియల్ మీ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో విపులంగా తెలుసుకుందామా.
పోకో ఈ ఫోన్ ను మూడు వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ (8GB + 256) ను రూ. 29,999 ధరతో ప్రకటించింది. రెండవ (12GB + 256) వేరియంట్ ను రూ. 31,999 ధరతో ప్రకటించింది. హాయ్ ఎండ్ (12GB + 512) వేరియంట్ ను రూ. 33,999 ధరతో ప్రకటించింది.
ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మే 29 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా జరుగుతుంది. ఈ ఫోన్ పైన ఫస్ట్ సేల్ కోసం గొప్ప లాంచ్ ఆఫర్లను కూడా పోకో అందించింది.
ఈ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్లను కూడా పోకో అందించింది. ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. అంతేకాదు, మొదటి సేల్ నుండి ఈ ఫోన్ ను కొనే వారికి 1 ఇయర్ ఎక్స్టెండ్ వారంటీ ని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
Also Read: Amazon సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ Sale నుండి బ్రాండెడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డీల్స్.!
పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే తో అందించింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ తో ఉంటుంది మరియు Dolby Vision, HDR 10+ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి వుంది.
ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 8s Gen 3 తో పని చేస్తుంది. దీనికి జతగా 12 LPDDR5X RAM మరియు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Xiaomi Hyper OS తో పని చేస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP Sony IMX882 మెయిన్ కెమెరా మరియు జతగా మరొక కెమెరా వుంది. ఇది OIS మరియు EIS సపోర్ట్ లతో వస్తుంది మరియు 60 fps వద్ద 4K వీడియో లను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ లో 90W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ ఫోన్ ను త్వరగా చల్లబరచడానికి వీలుగా ఇందులో Ice Loop సిస్టం ఉన్నట్లు కూడా కంపెనీ తెలిపింది.