Poco F5: లాంచ్ డేట్ మరియు టీజింగ్ స్పెక్స్ రిలీజ్ చేసిన పోకో.!

Poco F5: లాంచ్ డేట్ మరియు టీజింగ్ స్పెక్స్ రిలీజ్ చేసిన పోకో.!
HIGHLIGHTS

Poco F5 లాంచ్ డేట్ ను కంపెనీ అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను టీజింగ్ చేస్తోంది

ఈ ఫోన్ డిస్ప్లే గురించి పోకో ప్రత్యేకంగా చెబుతోంది

పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Poco F5 లాంచ్ డేట్ ను కంపెనీ అనౌన్స్ చేసింది. పోకో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ పేజ్ నుండి ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను టీజింగ్ చేస్తోంది. Poco F5 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో మే 9వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు పోకో లాంచ్ డేట్ రిలీజ్ చేసింది. 

Poco F5: టీజింగ్ స్పెక్స్

Poco F5 స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ Gen 2 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు పోకో టీజింగ్ ద్వారా తెలిపింది. ఈ ప్రోసెసర్ 8+ Gen 1 ప్రోసెసర్ మాదిరిగానే ఉంటుందని మరియు ఇది కూడా 4nm ఫ్యాబ్రికేషన్ చిప్ సెట్ అని కూడా టీజింగ్ లో తెలిపింది. ఈ ఫోన్ AnTuTU స్కోర్ ను కూడా పోకో టీజర్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ 9,69.,903 AnTuTU స్కోర్ నమోదు చేసినట్లు చెబుతోంది. 

ఈ ఫోన్ లో అందించిన కూలింగ్ సిస్టం గురించి కూడా ముందే తెలిపింది. ఈ ఫోన్ లో 14 గ్రాఫైట్ లేయర్స్ కలిగిన పెద్ద వేపర్ ఛాంబర్ ఉన్నట్లు చూపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమేరా స్టాప్ డ్యూయల్ LED ఫ్లాష్ తో కనిపిస్తోంది. ఇందులో 64MP ప్రధాన ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే గురించి పోకో ప్రత్యేకంగా చెబుతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ 12బిట్ (68+ బిలియన్ కలర్స్) వస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన ఫోన్ ఇదే మొదటిది అవుతుందని కూడా పోకో టీజర్ ద్వారా చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo