Poco F5 5G: 12 బిట్ ప్యానల్ 7 ఫిల్మ్ కెమెరాస్ తో ఈరోజు లాంచ్ అయ్యింది.!
ఈరోజు విడుదలైన Poco F5 5G స్మార్ట్ ఫోన్
12 బిట్ ప్యానల్ 7 ఫిల్మ్ కెమెరాస్ తో లాంచ్
Dolby Vision కలిగిన 6.67 ఇంచ్ 12-bit FHD+ AMOLED డిస్ప్లేతో వచ్చింది
పోకో చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న Poco F5 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 12 బిట్ ప్యానల్ 7 ఫిల్మ్ కెమెరాస్ తో ఈరోజు లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ Dolby Vision సపోర్ట్ మరియు ఆకర్షణీయమైన కెమెరాలతో పాటుగా 7కెమేరాస్ ఫీచర్ తో వచ్చినట్లు పోకో ప్రత్యేకించి చెబుతోంది. ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
Poco F5 5G: ధర
Poco F5 5G: స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో రూ. 29,999 ధరలో వచ్చింది. ఈ ఫోన్ యొక్క 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 39,999 ధరతో లాంచ్ అయ్యింది.
Poco F5 5G: ప్రత్యేకతలు
ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు Dolby Vision కలిగిన 6.67 ఇంచ్ 12-bit FHD+ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 7+ Gen 2 ప్రోసెసర్ జతగా 8GB/12GB ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 256GB భారీ స్టోరేజ్ ను కూడా లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ MIUI 14 ఫాస్ట్ వేర్ పైన ఆండ్రాయిడ్ 13 OS తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 5,000mAh బిగ్ బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పోకో అందించింది. ఇక ఈ ఫోన్ కెమేరాల వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో OIS సపోర్ట్ తో 64MP మెయిన్ కెమెరా + 8MP అల్ట్రా వైడ్ కెమేరా + 2MP మ్యాక్రో కెమేరా ఉన్నాయి 16MP సెల్ఫీ కెమేరాని ఈ ఫోన్ లో పోకో అందించింది.
ఈ కెమేరాతో 30fps వద్ద 4K వీడియో, 60 fps/30 fps వద్ద 1080 వీడియో లను చిత్రికరించ వచ్చని పోకో తెలిపింది మరియు ఇందులో Film Camera ఫీచర్ ను కూడా అందించింది. ఈ ఫోన్ లో Hi-Res Audio సపోర్ట్ కూడా వుంది.