Poco C75 5G టీజింగ్ ప్రైస్ రిలీజ్ చేసిన కంపెనీ: చవకైన 5జి ఫోన్ గా వస్తోంది.!
Poco C75 5G లాంచ్ గురించి కంపెనీ టీజింగ్ మొదలుపెట్టింది
ఈ అప్ కమింగ్ ఫోన్ టీజింగ్ ప్రైస్ కూడా ప్రకటించింది
ఈ ఫోన్ టీజింగ్ ప్రైస్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రకటించింది
Poco C75 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి కంపెనీ టీజింగ్ మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ ప్రైస్ టీజింగ్ తో ఇప్పుడు మరింత ఈ ఫోన్ టీజింగ్ ను తారా స్థాయికి తీసుకు వెళ్ళింది. ఎందుకంటే, ఈ ఫోన్ ను చాలా చవక ధరకే భారత మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది.
Poco C75 5G : టీజింగ్ ప్రైస్ & లాంచ్
పోకో సి75 5జి స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధరను కూడా టీజింగ్ పేజీ ద్వారా ప్రకటించింది. ఈ ఫోన్ ను Flipkart ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ టీజింగ్ ప్రైస్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రకటించింది.
పోకో సి75 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 7,XXXX ధరతో లాంచ్ చేస్తున్నట్లు పోకో టీజింగ్ చేస్తోంది. ఎంత ఎక్కువగా వేసుకున్న ఈ ఫోన్ 8 వేల కంటే తక్కువ ధరలో వస్తుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అయితే, ఈ ఫోన్ రేటును చూసి స్పెక్స్ ను అంచనా వేయకండి అని కూడా చెబుతోంది.
Also Read: Flipkart Sale చివరి రోజు బిగ్ డీల్: 22 వేలకే బ్రాండెడ్ 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!
Poco C75 5G : ఫీచర్స్
పోకో సి75 5జి స్మార్ట్ ఫోన్ ను మంచి ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ 4nm బడ్జెట్ చిప్ సెట్ Snapdragon 4 Gen 2 తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తోంది. ఏ ఫోన్ లో 4GB ర్యామ్ మరియు 4GB టర్బో ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 2+1 కార్డు స్లాట్ మరియు టైప్ C పోర్ట్ ఉన్నాయి.
ఈ ఫోన్ ను 600నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన 6.88 ఇంచ్ HD+ స్క్రీన్ తో లాంచ్ చేస్తోంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ షింక్ రిఫ్రెష్ రేట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో 50MP Sony కెమెరా మరియు డీటెయిల్స్ ఫోటోలు తియ్యగల సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా పోకో తెలిపింది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు Android 14 OS తో హైపర్ OS పై నడుస్తుంది.