Poco C71 లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
పోకో C సిరీస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
పోకో C సిరీస్ నుంచి Poco C71 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
టీజింగ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు అర్థం అవుతోంది
పోకో C సిరీస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. పోకో C సిరీస్ నుంచి Poco C71 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు కలర్ వేరియంట్స్ లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం కంపెనీ చేస్తున్న టీజింగ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇందులో డెజర్ట్ గోల్డ్ కలర్ మొబైల్ సరికొత్తగా కలర్ తో బాగా ఆకట్టుకుంటోంది.
Poco C71 : ఎప్పుడు లాంచ్ అవుతుంది?
పోకో సి 71 స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు పోకో డేట్ మరియు టైమ్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Poco C71 : ఫీచర్స్
పోకో సి71 స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతోంది. ఈ విషయం ఈ ఫోన్ ఇమేజ్ ను చూడగానే అర్ధం అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ మెరిసే కెమెరా బంప్ కలిగిన ప్రీమియం స్ప్లిట్ గ్రిడ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు మూడు డిఫరెంట్ కలర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ 6.88 ఇంచ్ పెద్ద HD+ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు వెట్ టచ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 32MP ప్రధాన కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7 ఫిలిం ఫిల్టర్స్, నైట్ ఫోటోగ్రఫీ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP52 రేటెడ్ వాటర్ రెపెల్లెంట్ ఫీచర్ తో వస్తుంది.
ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ 300K పైగా AnTuTu స్కోర్ అందించే ఆక్టా కోర్ స్కోర్, 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 6GB టర్బో ర్యామ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ 2TB వరకు మెమోరీ పెంచుకునే ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 5200 mAh బిగ్ బ్యాటరీ మరియు 15W ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది.
Also Read: Vivo V50e: అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ మరియు స్టన్నింగ్ కెమెరాతో లాంచ్ అవుతోంది.!
ఈ ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది. పోకో సి71 స్మార్ట్ ఫోన్ ను పవర్ బ్లాక్, కూల్ బ్లూ మరియు డెజర్ట్ గోల్డ్ మూడు రంగుల్లో లాంచ్ అవుతుంది.