POCO C65: కొత్త లుక్ తో వస్తున్న పోకో New ఫోన్..!
New ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమయ్యింది పోకో కంపెనీ
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేయటానికి పోకో డేట్ అనౌన్స్ చేసింది
POCO C65 స్మార్ట్ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేయబోతోంది
New ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమయ్యింది పోకో కంపెనీ. పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గా పిలువబడే C సిరీస్ నుండి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేయటానికి పోకో డేట్ అనౌన్స్ చేసింది. అదే, POCO C65 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ లో నవంబర్ 5వ తేదీ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ, అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ ఫోన్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది. పోకో యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క విశేషాలు ఏమిటో చూద్దామా.
POCO C65
పోకో సి65 స్మార్ట్ ఫోన్ యొక్క లుక్ ను వెల్లడిస్తూ కంపెనీ ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ తో ట్వీట్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కొత్త ట్రెండీ లుక్స్ తో వస్తున్నట్లు మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ సిరీస్ లో ముందుగా వచ్చిన స్మార్ట్ ఫోన్స్ కంటే ఈ ఫోన్ మరింత ట్రెండీగా మరియు ఆకట్టుకునే డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఇమేజ్ నుండి ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవబోతున్నట్లు కనిపిస్తోంది.
కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ చాలా సన్నగా ఉన్నట్లు మనం చూడవచ్చు. ఈ ఫోన్ లో వెనుక 50MP ప్రధాన కెమేరా కలిగిన సెటప్ ఉంటుంది మరియు ఈ కెమేరా సెటప్ ఈ ఫోన్ ను ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించేలా చేస్తోంది. ఈ ఫోన్ యొక్క RAM మరియు స్టోరేజ్ వేరియంట్స్ ను కూడా కంపెనీ వెల్లడించింది.
Also Read : కలుషిత గాలి నుండి కాపాడే Air Purifier ల పైన Amazon Sale బిగ్ డీల్స్.!
పోకో సి65 వేరియంట్స్
ఈ ఫోన్ రెండు వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. అందులో, మొదటిది 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. రెండవది 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్. ఈ ఫోన్ ధరలను కూడా కంపెనీ ముందే తెలిపింది.
పోకో సి65 ధర
పోకో సి65 స్మార్ట్ ఫోన్ US మార్కెట్ ధరలను కూడా కంపెనీ ముందుగానే ప్రకటించింది. ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ ( 6GB + 128GB ) US మార్కెట్ లో $109 (సుమారు రూ. 9,100) ధరతో లాంచ్ అవుతుంది. అలాగే, ( 8GB + 256GB ) US మార్కెట్ లో $109 (సుమారు రూ. 9,100) ధరతో లాంచ్ అవుతుంది.
అయితే, ఇండియన్ మార్కెట్ ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు.