POCO C65: స్లిమ్ డిజైన్, స్టన్నింగ్ ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది.!

Updated on 15-Dec-2023
HIGHLIGHTS

పోకో ఈరోజు తన కొత్త స్మార్ట్ ఫోన్ POCO C65 ను విడుదల చేసింది

పోకో బడ్జెట్ సిరీస్ గా పేరొందిన C సిరీస్ నుండి లాంచ్

లేటెస్ట్ ట్రెండ్ గా చెబుతున్న చాలా ఫీచర్స్ తో తీసుకు వచ్చింది

పోకో ఈరోజు తన కొత్త స్మార్ట్ ఫోన్ POCO C65 ను విడుదల చేసింది. పోకో బడ్జెట్ సిరీస్ గా పేరొందిన C సిరీస్ నుండి లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ 8GB + 8GB ర్యామ్ ఫీచర్ వంటి చాలా ఫీచర్స్ తో చవక ధరలో వచ్చింది. 10 వేల రూపాయల ధరలో ఇండియన్ మార్కెట్ లో ఇప్పటికే చాలా పోటీ నడుస్తుండగా ఈ ఫోన్ మరింత పోటీ పెంచే విధంగా వుంది. ఎందుకంటే, పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ ట్రెండ్ గా చెబుతున్న చాలా ఫీచర్స్ తో తీసుకు వచ్చింది.

POCO C65 Price

ముందుగా పోకో సి65 స్మార్ట్ ఫోన్ ధర వివరాలికి వెళితే, ఈ ఫోన్ ను కంపెనీ మూడు వేరియంట్ లతో అందించింది. ఈ మూడు వేరియంట్ ధరలను ఈ క్రింద చూడవచ్చు.

పోకో సి 65 (4GB + 128 GB) వేరియంట్ ధర రూ. 8,499

పోకో సి 65 (6GB + 128 GB) వేరియంట్ ధర రూ. 9,499

పోకో సి 65 (8GB + 256 GB) వేరియంట్ ధర రూ. 10,999

పోకో సి65 స్మార్ట్ ఫోన్ ధర

పోకో సి 65 ఆఫర్లు

పోకో సి 65 ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ మరియు EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,000 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పోకో సి 65 మొదటి సేల్ డిసెంబర్ 18 నుండి మొదలవుతుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ మరియు Flipkart నుండి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read : JioTV Premium Plans: 14 OTT సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్స్ ప్రకటించిన జియో.!

పోకో సి 65 ప్రత్యేకతలు

పోకో సి 65 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ గేమింగ్ ప్రోసెసర్ మీడియాటెక్ Helio G85 తో పనిచేస్తుంది. ఈ ప్రోసెసర్ కి జతగా 8GB వరకూ ర్యామ్ మరియు 8GB వరకూ టర్బో ర్యామ్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 256 GB భారీ అంతర్గత స్టోరేజ్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ లో కెమేరా మరియు ఎంటర్టైన్మెంట్ కోసం పెద్ద పీఠ వేసింది పోకో.

పోకో సి 65 ప్రత్యేకతలు

ఎందుకంటే, ఈ ఫోన్ లో పెద్ద 6.74 డిస్ప్లేని HD+ (1650 x 720) రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది. ఈ డిస్ప్లే కంటెంట్ ను ఎంజాయ్ చెయ్యడానికి అనువైన తక్కువ బ్లూ లైట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ లో 50MP + AI Lens + 2MP ట్రిపుల్ కెమేరా సెటప్ అందించింది. ఈ ఇది 7 ఫిల్మ్ కెమేరా అని, పరిసరాలకి అనుగుణంగా మంచి పోర్ట్రైట్ లను అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది.

ఇక ఈ ఫోన్ లో అందించిన ఇతర వివరాలను పరిశీలిస్తే, ఈ ఫోన్ లో 5000 mAh మేస్సివ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వుంది మరియు MIUI 14 సాఫ్ట్ వేర్ తో Android 13 OS పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :