Poco C61 vs Lava O2: రెండు ఫోన్ లలో బెటర్ ఏది.. కంప్లీట్ కంపేరిజన్.!

Updated on 26-Mar-2024
HIGHLIGHTS

Poco C61 vs Lava O2 స్మార్ట్ ఫోన్ల కంప్లీట్ కంపేరిజన్

ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్ ఆప్షన్ అవుతుంది

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క ధర, స్పెక్స్ కంప్లీట్ కంపేరిజన్

Poco C61 vs Lava O2: భారత్ మార్కెట్ లో ఇటీవల విడుదలైన బడ్జెట్ ఒక రెండు స్మార్ట్ ఫోన్ల కంప్లీట్ కంపేరిజన్ ఈరోజు చూడనున్నాము. ఈరోజే ఇండియాలో విడుదలైన పోకో C61 ఫోన్ ఒకటైతే, రీసెంట్ గా విడుదలైన లావా ఓ2 ఫోన్ మరొకటి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క ధర, స్పెక్స్ మరియు ఇతర వివరాలు ఎలా ఉన్నాయో ఈరోజు చూద్దాం.

Poco C61 vs Lava O2

Price

పోకో సి61 స్మార్ట్ ఫోన్ (6 GB + 128 GB) హై ఎండ్ వేరియంట్ ను రూ. 8,499 ధరతో విడుదల చేసింది. అయితే, లావా ఓ2 స్మార్ట్ ఫోన్ మాత్రం 8GB + 128GB వేరియంట్ రూ. 8,499 ధరకే లభిస్తుంది.

Design

పోకో C61 స్మార్ట్ ఫోన్ కొత్త రేడియంట్ రింగ్ డిజైన్ తో లాంఛ్ అయ్యింది. లావా ఓ2 స్మార్ట్ ఫోన్ AG గ్లాస్ బ్యాక్ డిజైన్ తో వచ్చింది. డిజైన్ పరంగా ఈ రెండు ఫోన్లు విలక్షణంగానే ఉన్నాయి.

Display

Poco C61 vs lava o2 display

ఈ పోకో కొత్త ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్ మరియు Gorilla Glass 3 రక్షణ కలిగిన 6.71 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. లావా ఓ2 ఫోన్ సన్నని అంచులు కలిగిన 6.5 ఇంచ్ HD+ Punch Hole సెల్ఫీ కెమేరా డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది.

Processor

పోకో సి61 ఫోన్ Mediatek బడ్జెట్ ప్రోసెసర్ Helio G36 తో పని చేస్తుంది. లావా ఓ2 స్మార్ట్ ఫోన్ Unisoc T616 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది.

Also Read: Poco C61: పోకో నుండి కొత్త బడ్జెట్ ఫోన్ లాంఛ్..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

Ram & Storage

పోకో సి61 స్మార్ట్ ఫోన్ హై ఎండ్ వేరియంట్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. అయితే, లావా ఓ2 మాత్రం 8GB RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.

Camera

పోకో C61 లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఇందులో, 8MP మెయిన్ కెమేరా వుంది మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. అయితే, లావా ఓ2 స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP డయల్ AI రియర్ కెమేరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా వుంది.

Batter & Charge tech

ఇక ఈ ఫోన్లలోని బ్యాటరీ ఛార్జ్ టెక్ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లలో 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది. అయితే, పోకో ఫోన్ 10 W Type-C చార్జ్ సపోర్ట్ ఉంటే, లావా ఫోన్ లో మాత్రం 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వుంది.

OS

లావా ఓ2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS పైన పని చేస్తుంది. అయితే, పోకో సి61 స్మార్ట్ ఫోన్ మాత్రం లేటెస్ట్ Android 14 OS తో నడుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :