Poco C61: కొత్త రేడియంట్ రింగ్ డిజైన్ తో వస్తోంది..లాంఛ్ ఎప్పుడంటే.!
పోకో సిరీస్ నుండి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Poco C61 ని లాంఛ్ చేస్తోంది
పోకో సి61 స్మార్ట్ ఫోన్ ను మార్చి 26వ తేదీ లాంఛ్ చేస్తోంది
ఈ ఫోన్ ను కొత్త రేడియంట్ రింగ్ డిజైన్ తో తీసుకు వస్తునట్లు తెలిపింది
Poco C61: పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి కొత్త ఫోన్ ను లాంఛ్ కోసం డేట్ అనౌన్స్ చేసింది. పోకో బడ్జెట్ సిరీస్ పోకో సిరీస్ నుండి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ పోకో సి61 ని లాంఛ్ చేస్తుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లు మరియు డిజైన్ తో పోకో టీజింగ్ మొదలు పెట్టింది. మరి పోకో లాంచ్ చేయబోతున్న అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సి 61 విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.
Poco C61 ఎప్పుడు లాంఛ్ అవుతుంది?
పోకో సి61 స్మార్ట్ ఫోన్ ను మార్చి 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి లాంఛ్ చేస్తున్నట్లు డేట్ మరియు టైమ్ ను సెట్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కి సేల్ పార్ట్నర్ గా Flipkart వ్యవహరిస్తుంది. ఈ అప్ కమింగ్ కీలకమైన ఫీచర్లతో ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేస్ ద్వారా ఈ ఫోన్ యొక్క టీజర్ వివరాలను అందించింది.
Also Read: Big Screen అందించే కొత్త Smart Projectors వస్తున్నాయి | Tech News
ఏమిటా Poco C61 టీజర్ ఫీచర్లు?
పోకో సి61 స్మార్ట్ ఫోన్ డిజైన్, బ్యాటరీ, డిస్ప్లే మరియు మరిన్ని వివరాలను టీజింగ్ ద్వారా అందించింది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ ను కొత్త రేడియంట్ రింగ్ డిజైన్ తో తీసుకు వస్తునట్లు తెలిపింది. ఈ డిజైన్తో ఈ ఫోన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తోంది.
డిజైన్ గురించి చూస్తే, పెద్ద కెమెరా బంప్ చుట్టూ ఒక పెద్ద వెలిగే రింగ్ ను అందించింది. ఈ పోకో అప్ కమింగ్ ఫోన్ లో వెనుక డ్యూయల్ AI రియర్ కెమేరా సెటప్ వుంది. వాటర్ డ్రాప్ డిజైన్ కలిగిన 90Hz రిఫ్రెష్ రేట్ HD+ డిస్ప్లేతో ఈ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు కూడా తెలిపింది.
ఈ స్మార్ట్ ఫోన్ RAM మరియు స్టోరేజ్ వివరాలను కూడా పోకో వెల్లడించింది. పోకో సి61 ఫోన్ లో 6GB ఫిజికల్ RAM + 6GB Turbo RAM ఫీచర్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుందని పోకో కన్ఫర్మ్ చేసింది.
ఈ పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఫీచర్స్ మరియు స్పెక్స్ ను చూస్తుంటే, ఈ ఫోన్ ను తక్కువ ధరలో మంచి ఫీచర్లతో లాంఛ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.