POCO C51 పైన బిగ్ డీల్: రూ. 4,999 కే పోకో 7GB RAM కొత్త ఫోన్ పొందండి.!

POCO C51 పైన బిగ్ డీల్: రూ. 4,999 కే పోకో 7GB RAM కొత్త ఫోన్ పొందండి.!
HIGHLIGHTS

POCO C51 పైన బిగ్ డీల్ అందుబాటులో వుంది

ఈ ఫోన్ ను కేవలం రూ. 4,999 ఆఫర్ ధరకే అందుకోవచ్చు

ఈ ఫోన్ బిగ్ 7GB RAM మరియు స్టోరేజ్ లతో కూడా వస్తుంది

పోకో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ POCO C51 పైన బిగ్ డీల్ అందుబాటులో వుంది. ఈ గొప్ప ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ. 4,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ బిగ్ 7GB RAM మరియు స్టోరేజ్ లతో కూడా వస్తుంది. పోకో ఇటీవల ఇండియన్ మార్కెట్ లో రూ. 8,499 రూపాయల ధరలో విడుదల చేసిన ఈ ఫోన్ ను ఎయిర్టెల్ బండిల్ ఆఫర్ తో రూ. 4,999 రూపాయల చవక రేటుకే అందుకునే అవకాశం వుంది.

POCO C51 పైన అందించిన బిగ్ డీల్ ఏమిటి?

పోకో సి51 స్మార్ట్ ఫోన్ ను రూ. 8,499 రూపాయల ప్రారంభ ధరలో అందించిన పోకో, ఎయిర్టెల్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ ద్వారా గొప్ప ఆఫర్ ను జత చేసింది. అదేమిటంటే, ఎయిర్టెల్ ప్రీపెయిడ్ SIM తో లాక్ చేసిన ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ను రూ. 4,999 రూపాయలకే ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన కేవలం రూ. 245 రూపాయల అతి తక్కువ EMI ఆఫర్ ను కూడా అందించింది.

POCO C51 With Airtel Offer
POCO C51 With Airtel Offer

అంటే, ఈ ఫోన్ ను కేవలం నెలకు రూ. 245 రూపాయల EMI చెల్లింపు పద్దతిలో కూడా పొందవచ్చు. ఈ EMI ఆఫర్ ను అన్ని ప్రధానమైన బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ పైన ఆఫర్ చేస్తోంది.

Also Read: Microsoft కొత్త VASA-1 AI టెక్ తో మాములు ఫోటో అవుతుంది మాట్లాడే ఫోటో.!

POCO C51 మరియు Airtel బండిల్ ఆఫర్ ఏమిటి?

ఇక ఈ బండిల్ లేదా లాక్ ఆఫర్ వివరాల్లోకి వెళితే, పోకో సి51 స్మార్ట్ ఫోన్ ను ఎయిర్టెల్ ప్రీపెయిడ్ SIM కార్డ్ తో లాక్ చేస్తుంది. అంటే, ఈ ఫోన్ లో మైన్ సిమ్ కార్డ్ కేవలం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ ను మాత్రమే ఉపయోగించాలి. అంతేకాదు, ఈ ఫోన్ ను రూ. 199 లేదా అంతకంటే పైన ఉండే అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ తో 18 నెలల పాటు రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

POCO C51 Airtel Offer
POCO C51 Airtel Offer

అయితే, ఈ ఫోన్ తో ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ను ఉపయోగించే వారికి అధనపు లాభాలను కూడా ఎయిర్టెల్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లాక్ సిమ్ కార్డ్ తో పైన తెలిపిన రీచార్జ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే వారికి 50GB అధనపు డేటా లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 750 వరకూ అధనపు తగ్గింపు ను పొందవచ్చు, అని కూడా పోకో చెబుతోంది.

పోకో సి51: ప్రత్యేకతలు

ఇక పోకో సి51 ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ మీడియాటెక్ Helio G36 5G ప్రొసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4GB RAM మరియు 64 GB ఇంటర్నల్ మెమొరీతో పాటు 1TB వరకూ స్టోరేజ్ పెంచుకోవడానికి అవకాశం వుంది. ఈ స్టోరేజ్ ను పెంచడానికి మైక్రో SD కార్డ్ ను ఉపయోగించాలి. అంతేకాదు, ఈ ఫోన్ లో 3GB Turbo RAM ఫీచర్ తో కలిపి టోటల్ 7GB RAM అందుతుంది.

ఈ పోకో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6.52 ఇంచ్ HD+ స్క్రీన్ ను 120Hz టచ్ శాంప్లింగ్ రేటుతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 8MP AI Dual Camera మరియు ముందు 5MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Android 13 (Go Edition) పైన నడుస్తుంది మరియు 5000 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo