POCO C50 స్మార్ట్ ఫోన్ జనవరి 3న ఇండియాలో లాంచ్ కావచ్చు: రిపోర్ట్

Updated on 29-Dec-2022
HIGHLIGHTS

POCO C50 స్మార్ట్ ఫోన్ జనవరి 3న ఇండియాలో లాంచ్ కావచ్చు

పోకో సి40 తరువాత వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇదే

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి వివరాలు తెలుసుకోండి

POCO C50 స్మార్ట్ ఫోన్ జనవరి 3న ఇండియాలో లాంచ్ కావచ్చు. 91 Mobiles లేటెస్ట్ న్యూస్ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎటువాంటి ఫీచర్లను కలిగి ఉండవచ్చనే విషయాన్ని కూడా తెలిపింది. ఇటీవల పోకో విడుదల చేసిన గ్లోబల్ వేరియంట్ పోకో సి40 తరువాత వస్తున్న స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది. అయితే ఇండియాలో మాత్రం C సిరీస్ నుండి ఇటీవల వచ్చిన C31 తరువాత వస్తున్న ఫోన్ C50 అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి వివరాలు తెలుసుకోండి. 

POCO C50: స్పెక్స్ (అంచనా)

ప్రస్తుతానికి, పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Poco C50 యొక్క డిజైన్ లేదా స్పెసిఫికేషన్‌లను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇది బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ గా రావచ్చని భావిస్తున్నారు (C Series ఎంట్రీ-లెవల్ కాబట్టి సిరీస్). దీన్నిబట్టి మేము ఈ ఫోన్ ప్లాస్టిక్ బాడీ మరియు వాటర్‌డ్రాప్ డిస్ప్లే వంటి ప్రాథమికతలను కలిగి ఉండవచ్చని భావిస్తున్నాము. 

అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ HD+ డిస్ప్లే మరియు స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ యొక్క బడ్జెట్ ప్రాసెసర్‌ తో రావచ్చని కూడా ఊహిస్తున్నాము. Poco త్వరలో ఈ ఫోన్ యొక్క ఫీచర్‌లను వెల్లడించడం ప్రారంభించవచ్చు.

ఇక ఇప్పటికే ఇండియాలో అంధుబాటులో వున్న POCO C31 స్పెక్స్ ను క్రింద చూడవచ్చు 

Realme C31: స్పెక్స్

రియల్ మీ సి31 స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ HD (1600×720) రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది మరియు 88.7% స్క్రీన్ టూ బాడీ రేషియోతో తో కలిగి వుంటుంది. ఈ స్క్రీన్ పైన 16.7M కలర్స్ ని ఎంజాయ్ చెయ్యవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ కేవలం 8.4mm మందంతో సన్నని డిజైన్ తో కూడా ఉంటుంది. C31 స్మార్ట్ ఫోన్ Unisoc T612 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 4GB ర్యామ్ తో పనిచేస్తుంది. మెమొరీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకూ విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ లైట్ సిల్వర్ మరియు డార్క్ గ్రీన్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.         

ఇక కెమెరాల విషయానికి వస్తే, Realme C31 స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది మరియు ఈ కెమెరా డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ సెటప్ లో 13MP Sony సెన్సార్ కలిగిన మైన్ కెమెరాకి జతగా ఒక B&W మరియు  ఒక మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 5MP AI సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఇందులో ఉన్న అల్ట్రా సేవింగ్ మోడ్ తో బ్యాటరీని మరింత సేవ్ చేయవచ్చని రియల్ మీ చెబుతోంది.

సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది. రియల్ మీ సి31 ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా Realme UI R Edition స్కిన్ పైన నడుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :