POCO C50: లాంచ్ అఫర్ క్రింద ఈరోజు రూ.6,299 ధరకే లభిస్తోంది.!

Updated on 10-Jan-2023
HIGHLIGHTS

POCO C50 స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈరోజు ఆఫర్ లో భాగంగా కేవలం రూ.6,299 రూపాయల ధరకే సేల్ చేస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకోండి

రీసెంట్ గా పోకో ఇండియాలో విడుదల చేసిన POCO C50 స్మార్ట్ ఫోన్ ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈరోజు మొదటి సేల్ కావడంతో ఇంట్రడక్టరీ అఫర్ లో భాగంగా ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.6,499 రూపాయల ధరతో లాంచ్ చెయ్యగా, ఈరోజు ఆఫర్ లో భాగంగా కేవలం రూ.6,299 రూపాయల ధరకే సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకోండి. 

Poco C50: ధర

పోకో సి50 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.6,499 రూపాయల ప్రారంభ ధరలో విడుదల చేసింది. ఇది 2GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ వేరియంట్ కోసం సెట్ చేసింది. ఈరోజు కేవలం రూ.6,299 రూపాయలకే లభిస్తుంది. ఇందులో 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299 రూపాయలుగా ప్రకటించింది. ఈ ఫోన్ కంట్రీ గ్రీన్ మరియు రాయల్ బ్లూ అనే రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది. ఈ సార్ట్ ఫోన్ Flipkart నుండి సేల్ అవుతోంది.  

Poco C50: స్పెక్స్

ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ C50 పెద్ద 6.5 ఇంచ్ స్క్రీన్ ని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB/3GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. మెమోరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 512GB వరకూ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ వెనుక లెథర్ వంటి టెక్స్చర్ డిజైన్ తో ఆకర్షణీయంగా వుంది.  

కెమెరాల విషయానికి వస్తే, పోకో C50 స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ కెమేరా సెటప్ ఓ వచ్చింది. ఇందులో, 8MP మెయిన్ కెమేరాతో మరొక కెమెరాతో వస్తుంది. అలాగే, ముందుభాగంలో 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 10W సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 (Go Edition) ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :