Poco X7 Pro Iron Man Edition ను కూడా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన పోకో.!

Updated on 02-Jan-2025
HIGHLIGHTS

అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ గురించి టీజింగ్

Poco X7 Pro Iron Man Edition లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది

పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి మూడు ఫోన్ల లాంచ్ కన్ఫర్మ్

అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ గురించి ఇప్పటికే టీజింగ్ చేస్తున్న పోకో ఇప్పుడు Poco X7 Pro Iron Man Edition ను కూడా ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి ముందుగా రెండు ఫోన్లు లాంచ్ గురించి మాత్రమే ప్రస్తావించిన కంపెనీ ఇప్పుడు మూడవ ఫోన్ వివరాలు కూడా బయటపెట్టింది.  అంటే, పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి మూడు ఫోన్లు లాంచ్ చేస్తుందని కన్ఫర్మ్ చేసింది.

Poco X7 Pro Iron Man Edition

కొత్త సంవత్సరం కొత్త ఫోన్స్ లాంచ్ తో పోకో మార్కెట్ లో అడుగు పెడుతోంది. ఈ 2025 జనవరి 9 వ తేదీ సాయంత్రం 8 గంటలకు ఈ ఫోన్ లను ఇండియాతో సహా ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి X7 5G, X7 Pro 5G మరియు X7 Pro Iron Man Edition మూడు ఫోన్ లను లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

పోకో ఎక్స్ 7 ప్రో ఐరన్ మ్యాన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ను కన్ఫర్మ్ చేస్తూ కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్ కూడా బయటపడింది. కంపెనీ యొక్క అధికారిక X అకౌంట్ నుంచి అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ ను క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ తో తీసుకు వస్తున్నట్లు అర్ధం అవుతుంది. అంతేలేదు, ఈ ఫోన్ చాలా సన్నని అంచులు కలిగి ఉంటుందని కూడా అర్ధం అవుతోంది.

Poco X7 Pro 5G : ఫీచర్స్

పోకో ఎక్స్ 7 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ఒక్కొక్కటిగా కంపెనీ బయటపెడుతోంది. పోకో ఎక్స్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8400 Ultra చిప్ సెట్ తో తీసుకు వస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను 90W హైపర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీతో అందిస్తున్నట్లు కూడా తెలిపింది   

అంతేకాదు, ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు కెమెరా వివరాలు కూడా టీజర్ ఇమేజ్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఎల్లో & బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ లో ప్రీమియం లెథర్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక 50MP OIS ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది.

Also Read: Xiaomi లేటెస్ట్ 4K Smart Tv పై బిగ్ డిస్కౌంట్ అందించిన అమెజాన్.! 

ఈ అప్ కమింగ్ సిరీస్ మరిన్ని వివరాలు మరియు అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది మీ డిజిట్ తెలుగు.     

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :