ఇండియా లో Phicomm Passion P660 కొత్త స్మార్ట్ ఫోన్

ఇండియా లో Phicomm Passion P660 కొత్త స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

దీని ధర 10,999 రూ.

Phicomm పేరుతో లేటెస్ట్ గా ఇండియాలో కొత్త బ్రాండ్ మార్కెటింగ్ ను ప్రారంభించింది. Phicomm ప్యాషన్ P660 అనే మోడల్ ను లాంచ్ చేసింది. 10,999 రూ. లకు ఈ స్మార్ట్ ఫోన్ ఈ కామర్స్ సైట్ అమెజాన్ నుండే జూన్ 9 నుండి అమ్మకాలను చేయనుంది.

Phicomm ప్యాషన్ P660 స్పెసిఫికేషన్స్ – 5 in FHD గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 7.3 mm స్లిమ్, 110గ్రా బరువు, 13MP బ్యాక్, 5MP ఫ్రంట్ కెమేరా, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్, మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ (ఇది నేనో సిమ్ స్లాట్ గా కూడా పనిచేయనుంది), డ్యూయల్ సిమ్, 4జి, వైఫై, బ్లూటూత్ 4.0, GPS, NFC, 2,330 mah బ్యాటరీ దీనిలో ఉన్నాయి.

Phicomm ప్యాషన్ P660 Xiaomi మి 4i కి పోటీ ఇవ్వనుంది. మి 4i లో 5in FHD డిస్ప్లే, 615 ఆక్టో కోర్ 64బిట్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 13MP బ్యాక్ డ్యూయల్ టోన్ ఫ్లాష్, 5MP ఫ్రంట్ కెమేరా, 3120 mah బ్యాటరీ ఉన్నాయి. మి 4i ధర 12,999 రూ. Xiaomi మి 4i స్మార్ట్ ఫోన్ ఫుల్ రివ్యూ ను ఇక్కడ చుడండి.

కొత్తగా ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టిన Phicomm బ్రాండ్ మిగిలిన కంపెనీల వలె మొదటిగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ను విడుదల చేసింది. దీనికి ముందే కూల్ ప్యాడ్, Meizu బ్రాండ్స్ ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలను మొదలు పెట్టాయి.
 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo