పెప్సీ డ్రింక్స్ కంపెని నుండి P1 స్మార్ట్ ఫోన్

పెప్సీ డ్రింక్స్ కంపెని నుండి P1 స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

2gb ర్యామ్, ఆక్టో కోర్ ప్రొసెసర్

ఇప్పటి వరకూ స్పోర్ట్స్ కార్స్ కంపెనీలు, ఫుట్ బాల టీమ్స్ మరియు యానిమేషన్ కేరక్టర్స్ బ్రాండ్స్ నుండి స్మార్ట్ ఫోన్స్ తయారు అయ్యాయి. ఇప్పుడు పెప్సీ డ్రింక్ కంపెని కూడా ఈ జాబితాలో చేరుతుంది.

చైనా లో మొదటి స్మార్ట్ ఫోన్ ను త్వరలో రిలీజ్ చేయనుంది అని అనౌన్స్ చేసింది నిన్న. పేరు పెప్సీ P1. ఫోన్ స్వయంగా పెప్సీ నే తయారీ చేయనుంది.

కొన్ని రోజుల క్రితమే mobipicker రిపోర్ట్ చేసింది Pepsoco china స్మార్ట్ ఫోన్ ను తయారు చేయనుంది అని. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ తో ఒక ఇమేజ్ కూడా లీక్ అయ్యింది Weibo లో.

ఇమేజ్ ప్రకారం ఈ ఫోన్ లో 5.5 in FHD డిస్ప్లే, మీడియా టెక్ ఆక్టో కోర్ SoC, 2gb ర్యామ్, 16 gb ఇంటర్నెల్ స్టోరేజ్, 13MP అండ్ 5MP కెమేరాస్, ఆండ్రాయిడ్ 5.1 ఉండనున్నాయి.

చూడటానికి దీని వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అక్టోబర్ 20 న అఫిషియల్ గా అనౌన్స్ అవుతుంది. చైనా లో దీని ధర 1,299 CNY. అంటే ఇండియాలో 13,350 రూ .

ఆధారం: Mobipick, Reuters

 

Digit.in
Logo
Digit.in
Logo