పెప్సీ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తుంది అని గతంలో రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు అది కన్ఫర్మ్ అయ్యింది అఫిషియల్ గా. దీని పేరు P1S.
పెప్సీ దీని కోసం క్రౌడ్ ఫండింగ్ campaign కూడా స్టార్ట్ చేసింది. చైనా లో ని JD ఫైనాన్స్ పై ఇది క్రౌడ్ ఫండింగ్ అవుతుంది.
దీనిలో 5.5 in ఫుల్ HD 2.5D డిస్ప్లే, మీడియా టెక్ 6592 1.7 GHz SoC, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ with sd కార్డ్ సపోర్ట్.
3000 mah బ్యాటరీ, 13MP రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1 os బేస్డ్ Dido కంపెని custom OS 6.1.
మెటల్ బాడీ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది అని రిపోర్ట్స్. ఈ campaign లో 10 రూ కూడా ఫండ్ చేయవచ్చు. 500 లో ప్రతీ ఒక ఒకరికి ఫోన్ win అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
1000 మందికి ఈ ఫోన్ 5,200 రూ లకు వస్తుంది. అయితే దీని లిమిట్ అయిపొయింది. ఇప్పడు 7,200 రూ లకు మరో 1000 మంది funders కు అవకాశం ఉంది.
అన్ లిమిటెడ్ మందికి ఫోన్ 13,400 రూ లకు వస్తుంది. డిసెంబర్ 3 నాటికి 3.1 కోటి రూ ఫండ్స్ వస్తే సక్సెస్ అయినట్లు P1S ప్రాజెక్ట్.
ఆధారం: G ఫర్ గేమ్స్