Pebble స్మార్ట్ వాచ్ ఇండియాలో అమెజాన్ సైట్ లో లాంచ్ అయ్యాయి. ఇవి వరల్డ్ వైడ్ గా బాగా ఫేమస్ అనే కాదు స్మార్ట్ వాచెస్ మార్కెట్ లో రెగ్యులర్ గా సేల్స్ చేస్తూ వచ్చిన మొదటి బ్రాండ్ ఇదే. చాలా కాలం నుండి తయారు అవుతున్నాయి.
ఇండియాలో మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. Pebble క్లాసిక్ – 5,999 రూ. Pebble Time – 9,999 రూ, Pebble Time రౌండ్ – 13,599 రూ అండ్ Pebble Time steel – 15,999 రూ.
ఇవి ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ ఫోనులకు సపోర్ట్ చేస్తాయి. 13,000 యాప్స్ అండ్ వాచ్ faces తో pebble కు సొంతంగా యాప్ స్టోర్ కూడా ఉంది వాచ్ లో.
క్లాసిక్ వాచ్ 1.26 in epaper డిస్ప్లే 144 x 168 పిక్సెల్స్ తో వస్తుంది. దీనిలో మోషన్ సెన్సార్ అండ్ ambient లైట్ సెన్సార్, వాటర్ ప్రూఫ్ కూడా ఉన్నాయి. 7 రోజులు బ్యాటరీ లైఫ్ తో Cherry Red, Jet Black, and Arctic White కలర్స్ లో వస్తుంది ఇది.
pebble time కూడా సేమ్ కాని కలర్ e – పేపర్ డిస్ప్లే అండ్ వాయిస్ తో మెసేజెస్ కు రిప్లై ఇచ్చే ఫీచర్ ఉంటుంది. Pebble Time steel లో స్టీల్ బాండ్ అండ్ 10 డేస్ బ్యాటరీ బ్యాక్ అప్ ఉంది.
Pebble Time Round రెండు బాండ్ సైజెస్ (14mm and 20mm) తో 28 గ్రా బరువుతో వస్తుంది. దీనిలో క్విక్ చార్జింగ్ ఉంది. 15 నిముషాలు చార్జ్ చేస్తే ఒక రోజు కంప్లీట్ గా వస్తుంది అని చెబుతుంది కంపెని.
Pebble Classic
Pebble Time
Pebble Time Steel
Pebble Time Round