టెలికాం కొత్త రూల్స్ ప్రకారం బ్రాండ్ ఏదైనా ప్రతీ స్మార్ట్ ఫోన్ కు panic బటన్ ఉండాలి
గతంలో ఇండియన్ govt ప్రతీ మొబైల్ కు panic బటన్ అనే సెపరేట్ ఫిక్స్డ్ ఫిజికల్ బటన్ యాడ్ చేసి సేఫ్టీ measures ను పెంచే యోచనలో ఉన్నట్లు తెలపటం జరిగింది కదా..
ఇప్పుడు ఇది జనవరి 1, 2017 నుండి అమల్లోకి రానుంది. అంటే బ్రాండ్ ఏదైనా, కంపెని దేశం ఏదైనా ఇండియాలో ఆ డేట్ తరువాత అమ్మే ప్రతీ స్మార్ట్ ఫోన్ కు panic బటన్ ఉండాలి.
హ్యూమన్ లైఫ్ ను బెటర్ చేయటానికే టెక్నాలజీ, మరి అదే టెక్నాలజీ ను women సెక్యురిటీ కు వాడితే ఇంతకన్నా బెటర్మెంట్ ఏముంటుంది అని టెలికాం మినిస్టర్, రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.
పానిక్ బటన్ లేని బేసిక్ ఫోన్లలో మాత్రం 5 లేదా 9 నంబర్ ప్రెస్ చేస్తే ఎమెర్జెన్సీ కాల్ కనెక్ట్ కావాలి. అలాగే ఈ బటన్ లేని స్మార్ట్ ఫోన్స్ కూడా కీ ప్యాడ్ లో అవే నంబర్స్ ప్రెస్ చేసిన లేక పవర్ బటన్ ను మూడు సార్లు క్విక్ ప్రెస్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వాలి.
ఇంకా 2018 జనవరి 1st నాటికి GPS ద్వారా లొకేషన్ తెలుసుకునే ఫెసిలిటీ అందించాలి ఇక నుండి స్మార్ట్ ఫోన్స్ అన్నీ. ఆల్రెడీ సేఫ్టీ measures లో భాగంగా కార్బన్ మొబైల్స్ SOS యాప్ ను డెవలప్ చేసింది. కొన్ని నెలలో అందుబాటులోకి వస్తుంది.