6GB ర్యామ్ తో రీసెంట్ గా రిలీజ్ అయిన oneplus 3 స్మార్ట్ ఫోన్ కు ఆక్సిజెన్ OS 3.2.2 రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు లాస్ట్ month లో రిలీజ్ అయిన వెర్షన్ 3.2.1 ఉండేది oneplus 3 పై.
Oneplus ఫోనుల్లో ఉండే ఏకైక మైనస్, కంపెని సొంతంగా డెవలప్ చేసే OS. దాదాపు 90 శాతం stock (ఒరిజినల్) ఆండ్రాయిడ్ లుక్స్ తోనే ఉండే ఇది కొన్ని అదనపు ఆప్షన్స్ తో వస్తుంది.
అయినా చాలా బగ్స్ ఉంటాయి. రిలీజ్ అయిన మొదటి వెర్షన్ నుండి ఇప్పటివరకు డైలీ లైఫ్ లో ఇబ్బంది పడే చాలా బగ్స్ ఉన్నాయి ఈ OS లో.
ఇప్పుడు రిలీజ్ చేసిన అప్ డేట్ లో కంపెని..improvements చేసింది. దీనితో పాటు parallel గా అఫీషియల్ గా CyanogenMod 13 build కూడా రిలీజ్ చేసింది oneplus. flash చేసుకొని రెండింటిలో ఏదైనా వాడుకోగలరు.
అయితే CyanogenMod 13 బిల్డ్ లో dash చార్జింగ్, ఆక్సిజన్ os stock కెమెరా పోస్ట్ processing ఫీచర్ లేవు.
ఇంతకీ changes ఏంటి Oxygen 3.2.2. లో?
మొదట్లో oneplus మరియు Cyanogen రెండూ పార్టనర్స్ గా ఉంది, oneplus ఫోనులపై cyanogen os ఉండేది, కానీ ఇద్దరికీ భిన్న అభిప్రాయాల కారణంగా విడిపోవటంతో oneplus సొంతంగా ఆక్సిజెన్ os తో వచ్చింది.