oneplus 3 ఫోన్ కు improvements తో ఆక్సిజెన్ os కొత్త వెర్షన్ రిలీజ్
6GB ర్యామ్ తో రీసెంట్ గా రిలీజ్ అయిన oneplus 3 స్మార్ట్ ఫోన్ కు ఆక్సిజెన్ OS 3.2.2 రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు లాస్ట్ month లో రిలీజ్ అయిన వెర్షన్ 3.2.1 ఉండేది oneplus 3 పై.
Oneplus ఫోనుల్లో ఉండే ఏకైక మైనస్, కంపెని సొంతంగా డెవలప్ చేసే OS. దాదాపు 90 శాతం stock (ఒరిజినల్) ఆండ్రాయిడ్ లుక్స్ తోనే ఉండే ఇది కొన్ని అదనపు ఆప్షన్స్ తో వస్తుంది.
అయినా చాలా బగ్స్ ఉంటాయి. రిలీజ్ అయిన మొదటి వెర్షన్ నుండి ఇప్పటివరకు డైలీ లైఫ్ లో ఇబ్బంది పడే చాలా బగ్స్ ఉన్నాయి ఈ OS లో.
ఇప్పుడు రిలీజ్ చేసిన అప్ డేట్ లో కంపెని..improvements చేసింది. దీనితో పాటు parallel గా అఫీషియల్ గా CyanogenMod 13 build కూడా రిలీజ్ చేసింది oneplus. flash చేసుకొని రెండింటిలో ఏదైనా వాడుకోగలరు.
అయితే CyanogenMod 13 బిల్డ్ లో dash చార్జింగ్, ఆక్సిజన్ os stock కెమెరా పోస్ట్ processing ఫీచర్ లేవు.
ఇంతకీ changes ఏంటి Oxygen 3.2.2. లో?
- doze mode లో బెటర్ నోటిఫికేషన్ management
- అలెర్ట్ స్లయిడర్ – సైలెంట్ మోడ్ తో ఉండే ఇబ్బందులను resolve చేసింది.
- 4K వీడియో రికార్డింగ్ codec ను అప్ డేట్ చేసింది.
- క్విక్ సెట్టింగ్స్ లో NFC toggle కనిపిస్తుంది.
- వీడియో రికార్డింగ్ లోనాయిస్ cancellation మెరుగు పరిచింది.
- పాకెట్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ను disable చేసింది.
- అదనంగా లేటెస్ట్ సెక్యూరిటీ patches మరియు ఇతర optimisations చోటుచేసుకున్నాయి.
మొదట్లో oneplus మరియు Cyanogen రెండూ పార్టనర్స్ గా ఉంది, oneplus ఫోనులపై cyanogen os ఉండేది, కానీ ఇద్దరికీ భిన్న అభిప్రాయాల కారణంగా విడిపోవటంతో oneplus సొంతంగా ఆక్సిజెన్ os తో వచ్చింది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile