Oppo Reno 13 Series ను ఒప్పో ఈరోజు విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగిన లాంచ్ ఈవెంట్ నుంచి ఈ రెండు ఫోన్లు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి ఒప్పో రెనో 13 5జి మరియు ఒప్పో రెనో 13 ప్రో 5జి రెండు ఫోన్లు లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్ల ధర, ఆఫర్లు మరియు సేల్ డేట్స్ ఏమిటో ఒక లుక్కేద్దాం.
ఒప్పో రెనో 13 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క ప్రైస్ మరియు ఆఫర్ వివరాలు క్రింద చూడవచ్చు.
ఒప్పో రెనో 13 ప్రో 5జి (12GB + 256GB) ధర : రూ. 49,999
ఒప్పో రెనో 13 ప్రో 5జి (12GB + 512GB) ధర : రూ. 54,999
ఒప్పో రెనో 13 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ లుమినస్ బ్లూ మరియు ఐవరీ వైట్ రెండు కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.
ఒప్పో రెనో 13 5జి ఫోన్ ను కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క ధర మరియు డీల్స్ వివరాలు క్రింద చూడవచ్చు.
ఒప్పో రెనో 13 5జి (8GB + 128GB) ధర : రూ. 37,999
ఒప్పో రెనో 13 5జి (8GB + 256GB) ధర : రూ. 59,999
ఒప్పో రెనో 13 5జి స్మార్ట్ ఫోన్ కూడా లుమినస్ బ్లూ మరియు ఐవరీ వైట్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చాయి. జనవరి 11 నుంచి ఈ ఫోన్ షిప్పింగ్ మొదలువుతుంది. ఈ ఫోన్స్ ఒప్పో స్టోర్, Flipkart మరియు అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది.
Also Read: Jio Limited Plan రెండు రోజుల్లో క్లోజ్ అవుతుంది.. ముగిసే లోపే రీఛార్జ్ చేయండి.!
ఒప్పో రెనో 13 ప్రో మరియు రెనో 13 రెండు ఫోన్స్ పై కూడా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్ ను అందించింది. ఈ ఫోన్ పై Federal, ICICI, BOBCARD, HDFC, Federal, IDFC First, SBI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI 10% డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఫోన్ ధరలో నేరుగా 10% డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇది కాకుండా, ఈ రెండు ఫోన్స్ పై రూ. 3000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ కొత్త ఫోన్ లను మంచి ఆఫర్ ధరకు అందుకోవచ్చని ఒప్పో తెలిపింది.