Oppo Reno 13 Series Launch డేట్ ను ఈరోజు ఒప్పో అనౌన్స్ చేసింది. గత కొన్ని రోజులుగా ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గురించి టీజింగ్ చేస్తున్న ఒప్పో, ఈరోజు ఈ సిరీస్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఒప్పో రెనో 13 సిరీస్ లంచ్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ సిరీస్ కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.
ఒప్పో రెనో 13 సిరీస్ ఇండియాలో జనవరి 9 వ తేదీ సాయంత్రం 5 గంటలకు లాంచ్ అవుతాయని ఒప్పో కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ ఫోన్స్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. రెనో 13 సీరీస్ ను Oppo AI సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి ఒప్పో రెనో 13 5జి మరియు ఒప్పో రెనో 13 ప్రో 5జి రెండు స్మార్ట్ ఫోన్ లు ఉంటాయి.
ఒప్పో ఈ అప్ కమింగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు సరికొత్త బటర్ ఫ్లై డిజైన్ తో లాంచ్ అవుతాయి. ఈ ఫోన్ లలో HDR 10+ సపోర్ట్ కలిగిన AMOLED స్క్రీన్ ఉండే అవకాశం వుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్ కి జతగా 12GB ర్యామ్ మరియు 512 ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేషియల్ రికగ్నైజేషన్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఒప్పో కమింగ్ సిరీస్ ఫోన్ లలో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50MP మెయిన్, 50MP టెలిఫోటో మరియు 8MP మరియు అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగి ఉండవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ లలో 50MP సెల్ఫీ కెమెరా అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 60fps వద్ద 4K వీడియో రికార్డ్ చేసే కెమెరా సెటప్ తో ఉంటుంది.
Also Read: లేటెస్ట్ Sony Smart Tv పై భారీ అమెజాన్ డీల్స్ అందుకోండి.!
ఒప్పో ఈరోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది కాబట్టి ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా త్వరగా అనౌన్స్ చేసే అవకాశం వుంది.