Oppo Reno 13 Series ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసిన ఒప్పో.!

Updated on 23-Dec-2024
HIGHLIGHTS

Oppo Reno 13 Series ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో కన్ఫర్మ్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లు AI సపోర్ట్ కలిగి ఉంటాయి

సరికొత్త బటర్ ఫ్లై షాడో డిజైన్ తో వస్తుందని ఒప్పో చెబుతోంది

Oppo Reno 13 Series ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లు AI సపోర్ట్ మరియు సరికొత్త బటర్ ఫ్లై షాడో డిజైన్ తో పాటు మరిన్ని సరికొత్త ఫీచర్ కలిగి ఉంటుందని ఒప్పో చెబుతోంది. ఒప్పో త్వరలో తీసుకు రాబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో తెలుసుకోండి.

Oppo Reno 13 Series : లాంచ్

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఒప్పో రెనో 13 సిరీస్ ఖచ్చితమైన లాంచ్ డేట్ ను మాత్రం కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ కోసం మాత్రం టీజింగ్ మొదలు పెట్టింది. ఒప్పో రెనో 13 సిరీస్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది మరియు ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది. ఈ పీజీ నుంచి టీజింగ్ చేస్తోంది మరియు ఈ అప్ కమింగ్ ఫోన్ కీలకమైన వివరాలు ఈ పీజీ నుంచి అందిస్తుంది.

Oppo Reno 13 Series : ఫీచర్స్

ఒప్పో రెనో 13 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ డిజైన్ మరియు కొన్ని కీలకమైన ఫీచర్స్ ను కంపెనీ X అకౌంట్ ను కంపెనీ టీజింగ్ చేస్తోంది. కంపెనీ అందించిన ఈ టీజర్ ఇమేజ్ ల ద్వారా ఒప్పో అప్ కమింగ్ ఫోన్స్ ను సరికొత్త బటర్ ఫ్లై షాడో డిజైన్ తో తీసుకువస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఇది చూడటానికి సరికొత్తగా ఉంది మరియు రెగ్యులర్ డిజైన్ కి భిన్నంగా కూడా వుంది.

ఈ ఫోన్ టీజర్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇది కాకుండా డ్యూయల్ స్పీకర్లు మరియు టైప్ C ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది.ఈ ఫోన్ లను IP69 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు ఒప్పో వెల్లడించింది. ఈ ఫోన్ లలో AI Live ఫోటో మరియు AI Editor ఫీచర్స్ ను కూడా అందిస్తోంది.

Also Read: 2025 జనవరి 1 నుంచి ఈ ఫోన్ లలో WhatsApp పనిచేయడం ఆగిపోతుంది.!

ఈ ఫోన్ ను జనవరి 2025 లో విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా లాంచ్ డేట్ తో పాటు అందిస్తుందని మనం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :