Oppo Reno 13 Pro Series స్టన్నింగ్ డిజైన్ మరియు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!

Oppo Reno 13 Pro Series స్టన్నింగ్ డిజైన్ మరియు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.!
HIGHLIGHTS

Oppo Reno 13 Pro Series ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది

స్మార్ట్ ఫోన్స్ డిజైన్ ను తెలియపరిచే టీజర్ పోస్టర్ లను విడుదల చేసింది.

స్టన్నింగ్ డిజైన్ మరియు ట్రిపుల్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది

Oppo Reno 13 Pro Series ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఈ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టిన కంపెనీ ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్స్ మరియు వాటి డిజైన్ ను తెలియపరిచే టీజర్ పోస్టర్ లను విడుదల చేసింది. కంపెనీ అందించిన టీజర్ పోస్టర్ ల ద్వారా ఓపప్పో ఈ సిరీస్ నుంచి ఫోన్ లను స్టన్నింగ్ డిజైన్ మరియు ట్రిపుల్ కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది.

Oppo Reno 13 Pro Series: లాంచ్ డేట్

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ రెనో 13 ప్రో సిరీస్ ను జనవరి నెలలో లాంచ్ చేస్తుందని చెబుతోంది. అయితే, ఈ సిరీస్ యొక్క లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ సిరీస్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ తెలిపే టీజర్ ఇమేజ్ మరియు వీడియోలతో టీజింగ్ మొదలు పెట్టింది.

Oppo Reno 13 Pro Series

ఒప్పో రెనో 13 ప్రో సిరీస్ నుంచి Reno 13 5G మరియు Reno 13 Pro 5G రెండు ఫోన్లు విడుదల చేస్తుందని ఒప్పో తెలిపింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ రెండు ఫోన్ లలో కూడా స్లీక్ డిజైన్ కామన్ గా కనిపిస్తోంది.

Also Read: Scam Calls :చిరాకు పెడుతున్నాయా.. ఫ్రాడ్ కాల్స్ ని ఇలా రిపోర్ట్ చేయండి.!

Oppo Reno 13 Pro Series: ఫీచర్స్

ఒప్పో అందించిన టీజర్ ఇమేజ్ ల ద్వారా రెనో 13 ప్రో 5జి మిస్ట్ లావెండర్ మరియు గ్రాఫైట్ గ్రే రెండు కలర్స్ వస్తుంది. అలాగే, రెనో 13 5జి ఫోన్ లుమినస్ బ్లూ మరియు ఐవరీ వైట్ రెండు కలర్ ఆప్షన్ లలో వస్తుందని ఒప్పో కన్ఫర్మ్ చేసింది.

ఈ సిరీస్ నుంచి వస్తున్న ఫోన్ లలో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ లను Oppo AI సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు కూడా ఒప్పో చెబుతోంది. ఆటో త్వరలోనే ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా ఒప్పో అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo