Oppo Reno 12 Series: ఒప్పో AI ఫోన్ లాంచ్ ప్రకటించిన కంపెనీ.!

Oppo Reno 12 Series: ఒప్పో AI ఫోన్ లాంచ్ ప్రకటించిన కంపెనీ.!
HIGHLIGHTS

ఒప్పో కొత్త ఫోన్ సిరీస్ లాంచ్ ను కన్ఫర్మ్ చేసింది

Oppo Reno 12 Series ఫోన్ లను AI సత్తాతో తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది

Oppo Reno 12 Series: ఒప్పో కొత్త ఫోన్ సిరీస్ లాంచ్ ను కన్ఫర్మ్ చేసింది. ఒప్పో రెనో 12 సిరీస్ ఫోన్ లను AI సత్తాతో తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి, గత నెలలోనే ఈ ఫోన్ లను చైనా మార్కెట్లో ఒప్పో విడుదల చేసింది. ఎట్టకేలకు నెల రోజుల తర్వాత ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇప్పటికి కూడా ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. జస్ట్ ‘Coming Soon’ ట్యాగ్ తో ఆట పాటిస్తోంది అంతే.

Oppo Reno 12 Series:

ఒప్పో రెనో 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ఒప్పో ప్రకటించింది. ఈ రెనో 12 సిరీస్ ఫోన్ లను త్వరలోనే ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లను AI సత్తాతో విడుదల చేయబోతున్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్ నుండి రెండు ఫోన్ లను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఇందులో, రెనో 12 మరియు రెనో 12 ప్రో రెండు ఫోన్లు ఉన్నాయి. ఇండియాలో కూడా ఈ రెండు ఫోన్లు లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.

ఒప్పో ఈ రెనో 12 సిరీస్ ఫోన్స్ కోసం ఫ్లిప్ కార్ట్ ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకుంది. అందుకే, ఈ ఫోన్స్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ బ్యానర్ మరియు మైక్రో సైట్ పేజి ను అందించింది. కంపెనీ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ వివరాలు కొన్ని తేటతెల్లమయ్యాయి.

Also Read: Lava upcoming: కొత్త ఫోన్ రెండర్ లతో టీజింగ్ చేస్తున్న లావా.!

ఈ ఫోన్స్ స్లీక్ డిజైన్ మరియు షైనీ ఫ్రెమ్ తో అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఈ ఫోన్ స్పెక్స్ ను కంపెనీ త్వరలోనే ప్రకటించే అవకాశం వుంది.

Oppo Reno 12 Series (China Variant)
Oppo Reno 12 Series (China Variant)

అయితే, చైనాలో విడుదల చేసిన అదే ఫీచర్ లతో అదే ఫోన్ ను ఇండియాలో కూడా అందిస్తుందో లేక ఏవైనా మార్పులు చేస్తుందో చూడాలి. ఎందుకంటే, ఈ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కూడా చూడటానికి అచ్చంగా చైనా వేరియంట్ మాదిరిగానే కనిపిస్తున్నాయి. అయితే, కంపెనీ అధికారికంగా ప్రకటించే వరకూ వేచి చూడాల్సి వస్తుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo