Oppo Reno 12 Series స్మార్ట్ ఫోన్ జూలై 12న AI సపోర్ట్ తో లాంచ్ చేస్తోంది.!
Oppo Reno 12 Series AI సపోర్ట్ తో లాంచ్ చేయబోతున్నట్లు ఒప్పో తెలిపింది
ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తుందని అంచనా వేస్తున్నారు
ఈ ఫోన్ లో Oppo AI కెమెరా సపోర్ట్ ఉన్నట్లు తెలిపింది
Oppo Reno 12 Series స్మార్ట్ ఫోన్ జూలై 12న AI సపోర్ట్ తో లాంచ్ చేయబోతున్నట్లు ఒప్పో తెలిపింది. ఈ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, చైనా మార్కెట్ లో ఈ సిరీస్ నుండి ఒప్పో రెనో 12 మరియు రెనో 12 ప్రో రెండు స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. అందుకే, ఇండియాలో కూడా ఇదే ఫోన్లను విడుదల చేయవచ్చని ఊహిస్తున్నారు.
Oppo Reno 12 Series
ఒప్పో రెనో 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను జూలై 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లో Oppo AI కెమెరా సపోర్ట్ ఉన్నట్లు తెలిపింది. ఈ AI సపోర్ట్ తో ఫోటోలను చాలా సులభంగా ఎడిట్ చేసుకుని అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈ ఫోన్ స్లీక్ డిజైన్ మరియు రౌండ్ కార్నర్ కలిగిన డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ డిజైన్ మరియు కెమెరా సెటప్ చూస్తుంటే, ఈ ఫోన్ చైనా లో విడుదలైన ఫోన్స్ మాదిరిగా కనిపిస్తోంది. అంతేకాదు, చైనాలో విడుదల చేసిన ఒప్పో రెనో 12 సిరీస్ ఫోన్లు కూడా AI సపోర్ట్ తో వచ్చాయి.
Also Read: అమెజాన్ లో టాప్ రేటెడ్ షియోమీ Smart TV పైన భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.!
ఒకవేళ, చైనాలో విడుదల చేసిన రెనో 12 సిరీస్ ఫోన్ లను ఇండియాలో కూడా విడుదల చేస్తే మాత్రం గొప్ప ఫీచర్లు కలిగిన ఫోన్ లను ఇండియన్ మార్కెట్ లో చేస్తునట్టు చెప్పవచ్చు. ఎందుకంటే, చైనా మార్కెట్ లో ఒప్పో విడుదల చేసిన ఒప్పో రెనో సిరీస్ ఫోన్ లలో మీడియా టెక్ పవర్ ఫుల్ ప్రోసెసర్, 16GB LPDDR5X ర్యామ్, 512GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్, 120Hz ProXDR డిస్ప్లే, 80W ఫాస్ట్ ఛార్జ్ మరియు 50MP సెల్ఫీ తో పాటు 50MP + 50MP + 112 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ లు కలిగిన ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్ తో వచ్చింది.
ఇండియాలో కూడా ఇదే ఫీచర్స్ తో ఈ రెనో 12 సిరీస్ ఫోన్ లంబ విడుదల చేస్తుందో లేక ఏవైనా మార్పులు చేస్తుందో తెలుసుకోవడానికి మరికొంత సమయం వేచి చూడాలి.