Oppo Reno 12 Series 5G నుండి రెండు స్మార్ట్ ఫోన్లు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి ఒప్పో రెనో 12 మరియు రెనో 12 ప్రో రెండు ఫోన్ లను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లలో AI సపోర్ట్ కలిగిన కెమెరా సెటప్ మరియు 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే వంటి చాలా ఫీచర్లను అందించింది. ఈరోజే సరికొత్తగా భారత మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్స్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
ఈ సిరీస్ నుండి విడుదల చేసిన తక్కువ ధర వేరియంట్ గా ఒప్పో రెనో 12 నిలుస్తుంది. ఈ ఫోన్ ను రూ. 32,999 రూపాయల ప్రారంభ ధరతో అందించింది. అయితే, రెనో 12 ప్రో వేరియంట్ ను రూ. 36,999 ధరతో అందించింది. ఈ ఫోన్ లతో గొప్ప ఆఫర్లను కూడా ఒప్పో అందించింది. అయితే, రెనో 8GB ర్యామ్ వస్తుంది మరియు రెనో 12 ప్రో మాత్రం 12GB ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది.
HDFC, ICICI, Kotak , Onecard మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ. 3,500 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ ను కూడా ఒప్పో అందించింది. ఈ ఫోన్ Pre Orders ను ఈరోజు నుంచే మొదలు పెట్టింది. రెనో 12 ప్రో సేల్ జులై 18 నుంచి ప్రారంభం అవుతుంది మరియు రెనో 12 మాత్రం జూలై 25 వ తేదీ నుంచి సేల్ కి వస్తుంది.
Also Read: WhatsApp గుడ్ న్యూస్: కొత్త అప్డేట్ తో వాయిస్ మెసేజ్ తర్జుమా ఫీచర్ తెస్తోంది.!
ఒప్పో రెనో 12 స్మార్ట్ ఫోన్ ను 6.7 ఇంచ్ 120Hz 3D Curved AMOLED డిస్ప్లే తో తీసుకు వచ్చింది. అయితే, రెనో 12 ప్రో స్మార్ట్ ఫోన్ ను మాత్రం HDR 10+ సపోర్ట్ కలిగిన Quad-curved ఇన్ఫినైట్ వ్యూ స్క్రీన్ తో అందించింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఇన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కలిగి ఉంటాయి. ఈ రెండు రెనో 12 సిరీస్ ఫోన్ లను కూడా Dimensity 7300 Energy చిప్ సెట్ తో అందించింది.
ఈ రెండు ఫోన్ లో రెనో 12 ఫోన్ 8GB ర్యామ్ తో వస్తే, రెనో 12 ప్రో మాత్రం 12GB ర్యామ్ వేరియంట్ మాత్రమే వచ్చింది. రెనో 12 సిరీస్ లో LPDDR4X ర్యామ్ సపోర్ట్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వుంది.ఈ ఫోన్స్ 5000 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తాయి మరియు ఈ రెండు ఫోన్ లలో 80W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్ లలో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP + 8MP + 50MP ట్రిపుల్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాతో 4K వీడియోలు AI సపోర్ట్ ఫోటోలు షూట్ చేయవచ్చు.