ఇండియాలో Oppo Reno 11 Series 5G స్మార్ట్ ఫోన్స్ లాంచ్ గురించి టీజింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఫోన్స్ కోసం ఒప్పో చేస్తున్న టీజర్ పేజ్ నుండి కొత్త ఫీచర్లతో ఈ ఫోన్స్ పైన మరిన్ని అంచనాలను పెంచింది. ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి విడుదల చేయనున్న ఒప్పో రెనో 11 ప్రో స్మార్ట్ ఫోన్ కెమేరా, ఛార్జ్ టెక్ మరియు మరిన్ని ఫీచర్లను ఇప్పటికే వెల్లడించింది. 24GB RAM ఫీచర్ తో Oppo Reno 11 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతున్నట్లు ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.
ఒప్పో రెనో 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను చాలా సన్నని మరియు 3D ఎచ్చింగ్ ప్రోసెస్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్ తో భారత్ లో విడుదలవుతున్న మొదటి ఫోన్ కూడా ఇదే అని ఒప్పొ చెబుతోంది. ఈ సిరీస్ గురించి కంపెనీ కొత్తగా అందించిన టీజర్ నుండి రెనో 11 ప్రో ను 12GB ర్యామ్ + 12GB ర్యామ్ ఫీచర్ తో 24GB RAM వరకూ ర్యామ్ ఉన్నట్లు మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు కూడా ఒప్పో తెలిపింది.
ఒప్పో రెనో 11 ప్రో ఫోన్ లో గొప్ప డిస్ప్లే ఉన్నట్లు ఒప్పో టీజర్ ద్వారా గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లలో 1.07 బిలియన్ కలర్స్ అందించ గల 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 93% స్క్రీన్ టూ బాడీ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫికేషన్ ను కూడా కలిగి ఉంటుంది.
Also Read : JIo Best Offer 2024: 84 రోజులు 14 OTT లను మరియు అన్లిమిటెడ్ లాభాలను అందుకోండి.!
ఒప్పో రెనో11 ప్రో ఫోన్ ను 4600 mAh బ్యాటరీని 80W superVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లాంచ్ చేస్తోంది. ఈ బ్యాటరీ 4 సంవత్సరాల మన్నికను కలిగి ఉంటుందని కూడా ఒప్పో తెలిపింది.
ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్ లలో 32MP టెలిఫోటో పోర్ట్రైట్ సెన్సార్ కలిగినట్రిపుల్ రియర్ కెమేరా ఉన్నట్లు ఒప్పో తెలిపింది. ఈ సెటప్ లో 50MP OIS కెమేరా, 32MP టెలిఫోటో కెమేరా మరియు 112 డిగ్రీల అల్ట్రా వైడ్ కేమెరా వున్నాయి. ఈ ఫోన్ లలో ముందు ఆటో ఫోకస్ సపోర్ట్ తో 32MP అల్ట్రా క్లియర్ సెల్ఫీ కెమేరా కూడా వుంది.