ఒప్పో గత కొంత కాలంగా టీజింగ్ చేస్తున్న ఒప్పో రెనో 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుండి OPPO Reno 11 5G స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో 32MP టెలిఫోటో కెమేరా సెటప్ వంటి మరిన్ని ఫీచర్లతో తీసుకు వచ్చింది. ఈ ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లో ఛార్జ్ టెక్ మొదలుకొని డిస్ప్లే వరకూ చాలా ప్రత్యేకతలు ఈ ధరలో సమంజసం అనిపించేలా అందించింది. మరి ఒప్పో రెనో 11 5జి స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
ముందుగా ఈ ఫోన్ ధర విషయానికి వస్తే, ఒప్పో రెనో 11 5జి ఫోన్ ను సింగల్ ర్యామ్ తో రెండు స్టోరేజ్ ఆప్షన్ లలో అందించింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ధర రూ. 29,999 మరియు 8GB + 256GB వేరియంట్ ధర రూ. 31,999 రూపాయలుగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ Pre Order లను ఈరోజు నుండే మొదలు పెట్టింది.
ఒప్పో రెనో 11 5జి స్మార్ట్ ఫోన్ పైన రూ. 3,000 డిస్కౌంట్ అందుకునే ఛాన్స్ ను లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ అందుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల వరకూ ఎక్స్ చేంజ్ బోనస్ ను కొద ఆఫర్ చేస్తోంది. అదనంగా, ఈ ఫోన్ తో పాటు 3 నెలల YouTube Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా కూడా ఆఫర్ చేస్తోంది.
ఒప్పో రెనో 11 5జి స్మార్ట్ ఫోన్ కొత్త డిజైన్ మరియు సిల్క్ టచ్ ఫీల్ తో చూడగానే ఆకట్టుకుంటుంది. డిజైన్ తో పాటుగా ఈ ఫోన్ ను 6.7 ఇంచ్ 3D Curved AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 93% స్క్రీన్ టూ బాడీ రేషియోతో సమన్వయం చేసింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7050 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ మరియు 8GB RAM తో అందించింది. ఈ ఫోన్ ను 128GB మరియు 256GB స్టోరేజ్ ఎంపికలో ఎంచుకోవచ్చు.
ఇక ఈ ఒప్పో కొత్త ఫోన్ కెమేరా వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక 50MP OIS + 8MP అల్ట్రా వైడ్ + 32MP టెలిఫోటో సెన్సార్ లతో ట్రిపుల్ కెమేరా అందించింది. ఇందులో, వన్ క్లిక్ స్మార్ట్ ఇమేజ్ మెట్టింగ్, పోర్ట్రైట్ ఎక్స్ పర్ట్ ఇంజన్ వంటి ఫీచర్లతో పాటు 4K Ultra-Clear Video లను కూడా చిత్రీకరించవచ్చని ఒప్పో చెబుతోంది. ఈ ఫోన్ ముందు భాగంలో 32MP (OMNIVISION OV32C) సెల్ఫీ కెమేరాని 4K వీడియో రికార్డింగ్ సౌకర్యంతో అందించింది.
ఇక ఈ ఫోన్ కలిగిన ఇతర ఫీచర్లు మరియు స్పెక్స్ వివరాలను చూస్తే, ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీ 67 W SUPERVOOC Flash Charge సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో Dual Stereo Speakers మరియు IR రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఈ ఒప్పో కొత్త ఫోన్ ColorOS 14.0 సాఫ్ట్ వేర్ పైన Android 14 OS తో పనిచేస్తుంది.