oppo R9s నుంచి గ్రీన్ కలర్ వేరియంట్ లాంచ్
oppo గత ఏడాది డిసెంబర్ లో తన oppo R9s మోడల్ ను భారత్ లో విడుదల చేసింది. చైనా లోని ఒక మార్కెటింగ్ పోస్టర్ ఆధారముగా oppo R9s నుంచి గ్రీన్ కలర్ వేరియంట్ లాంచ్ చేయబడుతుంది. మరియు R9s ప్లస్ కూడా గ్రీన్ కలర్ వేరియంట్ వస్తోంది . ఈ రెండు ఫోన్స్ అక్టోబర్ లో చైనా లో విడుదల అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ఫోన్ బ్లాక్ , గోల్డ్ ,రోజ్ గోల్డ్ వంటి కలర్స్ లో అందుబాటులో వుంది. అయితే ఈ గ్రీన్ కలర్ వేరియంట్ ఎప్పుడు లాంచ్ అవుతుందనేది మాత్రం ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే కొన్ని రూమర్స్ ప్రకారం ఈ నెల చివరిలో లాంచ్ కావచ్చు.
5. 5 ఇంచెస్ డిస్ప్లే , రెసొల్యూషన్ 1080 x 1920p ఈ డివైస్ కి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఈ డివైస్ 2 GHz ఆక్టోకోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ తో అడ్రినో 506GPU తో అందుబాటులో ఉంది. ఈ డివైస్ Android 6.0.1 మార్ష్మాల్లో ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. ఈ డివైస్ కి VOOC ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది 3,100mAh బ్యాటరీ. ఈ డివైస్ హోమ్ బటన్ పై ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా పొందుపరచబడి వుంది.
LED ఫ్లాష్ తో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ డివైస్ , 4G LTE, VoLTE, బ్లూటూత్ 4.1 మరియు GPS ఉంది. ఈ డివైస్ 145 గ్రాముల బరువు ఉంటుంది.
Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి
Xiaomi Redmi 3S Prime (Gold, 32GB), అమెజాన్ లో 8,999 లకు కొనండి