Oppo R17 Pro స్మార్ట్ ఫోన్ ప్రీ – ఆర్డర్లు ఈరోజు నుండి మొదలు : ఈ ఫోన్ ప్రత్యేకతలను తెలుసుకోండి
కేవలం 30 నిముషాల్లో, 92 శాతం ఛార్జ్ చేయగల SuperVooc ఫ్లాష్ టెక్నాలజీ దీని సొంతం.
Oppo యొక్క రాబోయే స్మార్ట్ ఫోన్, Oppo R17 Pro, ఈ రోజు 9:30 pm నుండి అమెజాన్ ఇండియాలో ప్రీ ఆర్డర్స్ మొదలవనున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ద్వారా ముందస్తు ఆర్డర్లను చూడవచ్చు మరియు హ్యాండ్ సెట్ పొందడానికి ప్రీ ఆర్డర్స్ చేసేవారిలో ఒకరు కావచ్చు. చైనా మార్కెట్లో Oppo ఇప్పటికే 4,299 యువాన్ ధరతో (సుమారు 44,300 రూపాయల) విడుదల చేసింది. ఈ పరికరం వెనుక రేడియంట్ ఫాగ్ రంగుతో డిజైన్ చేయబడింది అది డీప్ బ్లూ నుండి పర్పుల్ రంగులోకి మారే, డిజైన్ తో వస్తుంది మరియు ఒక ఎమిరాల్డ్ గ్రీన్ కలర్ వేరియంట్ కూడా ఉంది. ఒప్పో R17 ప్రో యొక్క అతిపెద్ద USP లలో ఒకటి SuperVooc ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఇది ఒప్పో R17 ప్రోని కేవలం 30 నిమిషాల్లో 92 శాతం వరకూ ఛార్జ్ చేస్తుంది.
Oppo R17 Pro ఇండియా లాంచ్ ఆఫర్లు
రిలయన్స్ జీయోతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసిన వినియోగదారులకు 3.2 TB జీయో 4G డేటా లభిస్తుంది మరియు రూ .4,900 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. అయితే, ఈ 3.2 టిబి డేటా అనేది రూ .299 ప్రీపెయిడ్ ప్రణాళికలతో రీఛార్జ్ చేసేటప్పుడు 39 రీఛార్జిల కోసం మాత్రమే వర్తిస్తుంది. Oppo కూడా ఒక ఇపుడు వన్ టైం స్క్రీన్ రిప్లేస్మెంట్ ఆఫర్ ఇస్తోంది. ఫోను కొనుగోలుకు సరిపడినంత డబ్బు లేదా ? అయితే, Oppo మీకోసం 'No Cost EMI' కూడా తీసుకువచ్చింది మరియు Amazon.in నుండి మీ యొక్క పాత స్మార్ట్ ఫోన్ మార్పిడితో 2000 తగ్గింపు కూడా పొందవచ్చు.
ఒప్పో R17 ప్రో : ప్రత్యేకతలు మరియు లక్షణాలు
ఒప్పో R17 ప్రో, 2340×1080 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ మరియు 19: 9 యాస్పెక్ట్ రేషియాతో ఒక 6.4-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ప్లే కలిగి ఉంది. డిస్ప్లేలో "వాటర్ డ్రాప్ " నోచ్ ఉంది, ఇది ఈ ఫోన్ 91.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోని సాధించడానికి సహయపడుతుంది. ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది మరియు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 రక్షణతో వస్తుంది. ఈ ఒప్పో సామ్రాట్ ఫోన్, కేవలం 0.41 సెకన్లలో స్మార్ట్ ఫోన్నిసమర్ధవంతంగా అన్లాక్ చేస్తుంది.
ఒప్పో R17 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 SoC (డ్యూయల్ 2.2GHz Kryo 360 + Hexa 1.7GHz Kryo 360 CPU లు) శక్తితో మరియు అడ్రినో 616 GPU గ్రాఫిక్స్ తో కలిసి ఉంటుంది. ఒక 8GB RAM + 128GB స్టోరేజి వేరియంట్, Android 8.1 (Oreo)తో స్మార్ట్ ఫోన్ వస్తుంది మరియు ColorOS 5.2 పై అమలవుతుంది.
ఫోటోగ్రఫీ పనితీరు విషయానికి వస్తే, వెనుక డ్యూయల్ – కెమెరా సెటప్ మరియు ముందు ఒకే కెమేరా ఇవ్వబడ్డాయి. వెనుకభాగంలో, ప్రాధమిక 12MP కెమెరా వేరియబుల్ ఎపర్చరు (f / 1.5 మరియు f / 2.4) తో వస్తుంది, అది కాంతి లభ్యతపై ఆధారపడి మారుతుంది. ద్వితీయ 20MP కెమెరా పోర్ట్రైట్ షాట్లు తీయడంలో సహాయపడుతుంది. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ (TOF) 3D సెన్సింగ్ టెక్నాలజీని కలిగి ఉంది, ఇవి నానో సెకండ్ ఇన్ఫ్రారెడ్ మెజెర్మెంట్ ద్వారా అధిక-లోతైన 3D డెప్త్ సమాచారం పొందవచ్చు. ముందు 25MP AI కెమెరాని అందించారు.
ఒప్పో R17 ప్రో, ఒక SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో 3,700mAh బ్యాటరీ కలిగి వుంది. ఇది మొదటిగా ఈ సంవత్సరం ఫైండ్ X లంబోర్ఘిని ఎడిషన్ లో తీసుకొచ్చింది మరియు అలాగే తర్వాత Oppo F9 ప్రో కోసం కూడా దారివేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో, కేవలం 10 నిముషాలలో ఫోన్ 0 నుండి 40 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చునని Oppo చెబుతోంది. ఇటీవల, ఒక నివేదిక ఒప్పో R17 ప్రో వేగంగా ఛార్జింగ్ చేయగలిగిన ఫోన్ అని పేర్కొంది . ఇది Oppo R17 ప్రో ఇతర 59 స్మార్ట్ ఫోన్లకు పోటీనిస్తుంది మరియు సంస్థ యొక్క ఈ SuperVOOC ఫ్లాష్ కేవలం 30 నిమిషాల్లో ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో 3700mAh సామర్ధ్యం కలిగిన ఈ బ్యాటరీని 92 శాతానికి ఛార్జ్ చేస్తుందని చెప్పారు.