హైలైట్స్
1. ఈ Oppo R17 ఈ రోజు అమేజాన్ నుండి కొనుగోలుచేయడానికి అందుబాటులో ఉంటుంది.
2. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 8GB RAM + 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది .
3. ఈ ఫోను కొనుగోలుతో కొనుగోలుదారులు క్యాష్ బ్యాక్ మరియు డిస్కౌంట్ వంటివి పొందవచ్చు.
ఆగస్టులో ప్రకటించిన Oppo R17, వెనుక గ్రేడియంట్ డిజైన్ తో వస్తుంది మరియు ఆంబియంట్ బ్లూ మరియు నియాన్ పర్పుల్ రంగులు అమేజాన్ ద్వారా అందుటులో ఉంటాయి. ఇది ఒక 3,500 mAh బ్యాటరీ VOOC ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం సౌకర్యంగా కలిగి ఉంది మరియు ఆండ్రాయిడ్ OS 8.1 (Oreo) ఆధారంగా కలర్ OS 5.2 తో నడుస్తుంది.
Oppo R17 ధర మరియు ఇండియాలో లాంచ్ ఆఫర్లు
ఈ ఒప్పో R17 స్మార్ట్ ఫోన్ యొక్క 8GB RAM + 128GB వేరియంట్ రూ. 34,990 ధరతో ఉంటుంది. రిలయన్స్ జీయో, ఈ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేసిన వినియోగదారులకు 3.2 TB జీయో 4G డేటా లభిస్తుంది మరియు రూ .4,900 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. అయితే, ఈ 3.2 టిబి డేటా అనేది రూ .299 ప్రీపెయిడ్ ప్రణాళికలతో రీఛార్జ్ చేసేటప్పుడు 39 రీఛార్జిల కోసం మాత్రమే వర్తిస్తుంది. 'No Cost EMI' కూడా అందుబాటులోవుంటుంది మరియు Amazon.in నుండి మీ యొక్క పాత స్మార్ట్ ఫోన్ మార్పిడితో 5000 తగ్గింపు కూడా పొందవచ్చు. అలాగే, HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా EMI తో కొనుగోలుచేసేవారు 5 నుండి 10 శాతం వరకు డిస్కౌంటునుకూడా పొందవచ్చు.
Oppo R17 స్పెసిఫికేషన్లు:
ఒప్పో ఆర్17 యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లు దాదాపుగా R17 ప్రో ని పోలి ఉంటాయి. ఇది గ్లాస్ రక్షణతో వెనుక గ్రేడియంట్ ని కలిగి ఉంది మరియు 19: 9 యాస్పెక్ట్ రేషియో గల ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ తో కూడిన ఒక 6.4-అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లే ని కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్ ఒక "వాటర్ డ్రాప్" డిస్ప్లే మరియు 91.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తుంది హుడ్ కింద, ఒప్పో ఆర్17 ఆడ్రినో 615 GPU తో 10nm ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 670 SoC (2x2GHz Kryo 360 కోర్స్ మరియు 6 x 1.7GHz Kryo 360) తో పనిచేస్తుంది.
ఈ ఫోన్ లో 0.41 సెకన్లలో అన్లాక్ చేయగల ఒక ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఆప్టిక్స్ పరంగా, ఒప్పో ఆర్17 ఒక డ్యూయల్ కెమెరా సెటప్ 16ఎంపీ ప్రాధమిక లెన్స్ తో ఇది f / 1.8 ఎపర్చర్ ని కలిగి ఉంది, మరియు 5ఎంపీ సెకండరీ సెన్సర్ పోర్ట్రైట్ షాట్స్ మరియు AI సీన్ గుర్తింపు కోసం ఉంది. ముందు, 25ఎంపీ AI షూటర్ ఉంది. స్మార్ట్ఫోన్లో 3,500 mAh బ్యాటరీ VOOC ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం సౌకర్యంగా కలిగి ఉంది మరియు ఆండ్రాయిడ్ OS 8.1 (Oreo) ఆధారంగా కలర్ OS 5.2 తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజి ఒకే వేరియంట్లలో లభిస్తుంది.