Oppo R17 మరియు R17 ప్రో ఒక 6.4-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేలు, 25MP సెల్ఫీ కెమెరాలతో ఇప్పుడు అధికారికంగా ప్రకటించబడ్డాయి

Oppo R17 మరియు R17 ప్రో ఒక  6.4-అంగుళాల ఫుల్  HD + డిస్ప్లేలు, 25MP సెల్ఫీ  కెమెరాలతో ఇప్పుడు అధికారికంగా ప్రకటించబడ్డాయి
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ల రేట్లను ఆవిష్కరించే సందర్భంగా, ఆగష్టు 30 నుండి R17 అందుబాటులో ఉంటుందని, చైనాలో అక్టోబర్ మధ్య నుంచి R17 ప్రో అందుబాటులో ఉంటుంది అని Oppo ప్రకటించింది.

Oppo ఇప్పుడు  R17 మరియు R17 ప్రో స్మార్ట్ ఫోన్ల టీజింగ్ ని కాసేపు చూపించిన తరువాత  ఇప్పుడు చైనా లో రెండు స్మార్ట్ ఫోన్ల ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్ల మధ్య వ్యత్యాసం ప్రాసెసర్ మరియు వెనుక కెమెరా సెటప్. Oppo R17  ధర 3199 యువాన్ (సుమారు రూ. 32,600) నుండి ప్రారంభమవుతుంది, మరియు ఇది అధికారిక Oppo వెబ్సైట్, jd.com, లింక్స్ మరియు సన్లింగ్ ల నుంచి ప్రీ-ఆర్డర్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇది ఆగస్టు 30 నుంచి చైనాలో విక్రయించనుంది. ది మోడెడ్ మోడల్ 4,299 యువాన్ (43,830 రూపాయలు) ధరతో, చైనాలో అక్టోబర్ మధ్యకాలం నుంచి అందుబాటులోకి వస్తుంది.

ఒప్పో ఆర్17 ప్రో స్పెసిఫికేషన్లు:

ఒప్పో ఆర్17 ప్రో వెనుక ఒక కొత్త ఫాగ్ గ్రేడియంట్ కలిగి మరియు 19: 9 యాస్పెక్ట్ రేషియోతో ఒక 6.4-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ప్లే ని కలిగివుంది. ఒప్పో ఒక వొప్పింగ్  91.5 శాతం స్క్రీన్ నుండి బాడీ నిష్పత్తి పంపిణీ చేయగల ఒక "వాటర్ డ్రాప్" నోచ్ తో ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 రక్షణతో అందించబడింది. ఒప్పో ఇప్పుడు సంప్రదాయబద్ధంగా  డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని  స్వీకరించిన కంపెనీలలో ఒకటి. ఒప్పో ఆర్17 ప్రో యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్మార్ట్ఫోన్ ని కేవలం 0.41 సెకన్లలో అన్లాక్ చేయగలదని సంస్థ వివరించింది. స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 SoC (డ్యూయల్ 2.2GHz క్రోయో 360 + హెక్సా 1.7GHz క్రోయో 360 CPU లు) ద్వారా నడుపబడుతుంది. అడ్రినో 616 GPU తో ఒప్పో ఆర్17 ప్రో ఒక 8GB RAM + 128GB స్టోరేజి వేరియంట్ ఇది మరియు ఆండ్రాయిడ్ OS 8.1 (Oreo) ఆధారంగా కలర్OS 5.2 నడుస్తుంది.

కెమెరా విభాగంలో ఒప్పో ఆర్17 ప్రో లో,  ట్రిపుల్ – కెమెరా వ్యవస్థను వెనుక మరియు ఒక షూటర్ ని ముందు భాగంలో చేర్చింది. ప్రాధమిక 12ఎంపీ వెనుక కెమెరా ఒక వేరియబుల్ ఎపర్చరు (f / 1.5 మరియు f / 2.4) తో వస్తుంది, అది కాంతి మీద ఆధారపడి మారుతుంది. ద్వితీయ 20ఎంపీ కెమెరా పోర్త్రైట్ చిత్రాలలో లోతుని సంగ్రహించడానికి సహాయపడుతుంది టైమ్ ఆఫ్ ఫ్లయిట్ (TOF) 3D సెన్సింగ్ కెమెరా నానోసెకండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ కొలత ద్వారా అధిక-ఖచ్చితమైన 3D లోతు సమాచారం పొందగల మూడవ వది కూడా ఉంది. ఒప్పోఆర్17 ప్రో ఈ సంవత్సరం ప్రారంభంలో ఫైండ్ ఎక్స్ ల్యామ్బోర్గని ఎడిషన్ తో పరిచయం చేసిన సూపర్ VOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో 3,700mAh (2 x 1850mAh) బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఛార్జర్ 10 నిమిషాల్లో 0 నుండి 40 శాతం వరకు ఫోన్ ఫోన్ ని వేగతరం  చేయగలదని Oppo చెబుతుంది.

 

ఒప్పో ఆర్17  స్పెసిఫికేషన్లు:

ఒప్పో ఆర్17 యొక్క స్పెక్స్ మరియు ఫీచర్లు దాదాపుగా R17 ప్రో ని పోలి ఉంటాయి. ఇది గ్లాస్ రక్షణతో వెనుక గ్రేడియంట్ ని కలిగి ఉంది మరియు  19: 9 యాస్పెక్ట్ రేషియో గల ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ తో కూడిన ఒక 6-అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లే ని కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్ ఒక "వాటర్ డ్రాప్" డిస్ప్లే మరియు 91.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోను అందిస్తుంది హుడ్ కింద, ఒప్పో ఆర్17 ఆడ్రినో 615 GPU తో 10nm ఆక్టా  కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 670 SoC (2x2GHz Kryo 360 కోర్స్ మరియు 6 x 1.7GHz Kryo 360) తో పనిచేస్తుంది.

ఈ ఫోన్ లో 0.41 సెకన్లలో అన్లాక్ చేయగల ఒక ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఆప్టిక్స్ పరంగా, ఒప్పో ఆర్17 ఒక డ్యూయల్ కెమెరా సెటప్ 16ఎంపీ ప్రాధమిక లెన్స్ తో  ఇది f / 1.8 ఎపర్చర్ ని కలిగి ఉంది,  మరియు 5ఎంపీ సెకండరీ సెన్సర్ పోర్ట్రైట్ షాట్స్ మరియు AI సీన్ గుర్తింపు కోసం ఉంది. ముందు, 25ఎంపీ AI షూటర్ ఉంది. స్మార్ట్ఫోన్లో 3,500 mAh బ్యాటరీ VOOC ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం సౌకర్యంగా కలిగి ఉంది మరియు ఆండ్రాయిడ్  OS 8.1 (Oreo) ఆధారంగా కలర్ OS 5.2 తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది: 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజి ధర (Rs 32,620 సుమారు) మరియు 8జీబీ  ర్యామ్ + 128జీబీ స్టోరేజి  ధర (రూ 35,500 సుమారు)గా వుంది. ఒప్పో ఆర్17 ట్విలైట్ బ్లూ మరియు స్టార్రి పర్పల్ రంగులలో గ్రేడియంట్ ప్రవణత ముగింపుతో వస్తాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo