Oppo R15 Pro వచ్చేసింది : ధర, స్పెక్స్ మరియు ప్రత్యేకతలు ఇవిగో !

Oppo R15 Pro వచ్చేసింది : ధర, స్పెక్స్ మరియు ప్రత్యేకతలు ఇవిగో !
HIGHLIGHTS

6GB ర్యామ్, స్నాప్ డ్రాగన్ 660 SoC మరియు అమేజాన్ ప్రత్యేకంగా అందుబాటులోకి

ముఖ్యాంశాలు:

1. Oppo R15 ప్రో భారతదేశం లో ప్రారంభించబడింది.

2. ఈ ఫోన్ 6GB RAM మరియు 128GB అంతర్గత మెమొరీతో వస్తుంది.

3. ఇది 25,990 రూపాయల ధరతో మరియు అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.

ఎటువంటి ఆర్భాటం లేకుండానే, Oppo భారతదేశంలో తన R15 Pro  స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది. ఈ హ్యాండ్సెట్ గతంలో చైనాలో మరియు భారతదేశంలో ప్రకటించబడింది, ఈ సంస్థ దాని సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా దీనిని ప్రకటించింది. ఈ డివైజ్, ప్రత్యేకంగా Amazon.in ద్వారా విక్రయించబడుతోంది మరియు దానిపై కొన్ని లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ డివైజ్ యొక్క ఒక ముఖ్యమైన లక్షణం పైన నోచ్, ఇది ఒక 6.28 అంగుళాల FHD + డిస్ప్లేను కలిగి ఉంది, VOOC ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది మరియు నీరు మరియు స్ప్లాష్-ప్రూఫ్ డిజైనుతో రాబోతుందని చెప్పబడింది కానీ దీని యొక్క IP రేటింగ్స్ గురించి మాత్రం  ఇక్కడ ప్రస్తావించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 'మెరుగైన – AI' కెమెరాలతో, వెనుకవైపున ఒక డ్యూయల్ సెన్సార్ మరియు ఒక ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్ను కూడా కలిగివుంది.

Oppo R15 Pro ప్రత్యేకతలు

ఈ R15 ప్రో  ఒక 6.28 అంగుళాల HD + OLED  ప్యానల్ను ఒక 19: 9 డిస్ప్లే ఆస్పెక్ట్ రేషియాతో మరియు 89 శాతం స్క్రీన్ -టూ- బాడీ నిష్పత్తితో కలిగివుంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్,  6GB RAM మరియు 128GB అంతర్గత మెమొరీతో పాటు మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు మెమోరిని పెంచుకునే సామర్ధాయాన్ని కలిగివుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్, Android 8.1Oreo OS పైన ఆధారపడిన ColorOS 5.0 తో నడుస్తుంది మరియు ఇది 3430 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది VOOC ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ కేవలం ఐదు నిమిషాల ఛార్జింగుతో, రెండు గంటల టాక్ టైమును  అందిస్తుందని చెప్పబడింది, అయినప్పటికీ, ఈ ఛార్జింగ్  వీడియోలను చూడడానికి, వాస్తవానికి ఎలా నిర్వర్తించగలదో తెలుసుకోవడానికి మీరు చూడవచ్చు.

ఆప్టిక్స్ పరంగా, ఒప్పో R15 ప్రో వెనుక 20MP + 16MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది, ఇక్కడ రెండు సెన్సార్లకు F / 2.0 ఎపర్చరు లెన్స్ లభిస్తుంది. ముందు, 20MP  f / 2.0 ఎపర్చరు తో సెన్సారుతో  ఈ డివైజ్ వస్తుంది. ఈ ఫోన్,  డ్యూయల్ సిమ్ (నానో + నానో), డ్యూయల్ స్టాండ్బై (4G + 4G) మరియు బ్లూటూత్ 5.0 తో పాటు, NFC కి కూడా మద్దతు ఇస్తుంది.

Oppo R15 Pro యొక్క ధర, లభ్యత మరియు లాంచ్ ఆఫర్లు

ఈ ఒప్పో R15 ప్రో, భారతదేశం లో రూ 25,990 ధరతో మరియు Amazon.in ద్వారా బహిరంగ అమ్మకానికి(ఓపెన్ సేల్)  ఉంది. ఇది కాస్మిక్ పర్పుల్ మరియు రూబీ రెడ్ రంగులలో వస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుకు కొన్ని లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. దీనితో జీయో వినియోగదారులు 3.2 టిబి డేటాను మరియు రూ .4,900 వరకు లాభాలను పొందుతారు. బజాజ్ ఫైన్ సర్వ్ EMI కార్డులపై కొనుగోలుచేసేవారికి No Cost EMI కూడా అందువబాటులో ఉంది, అలాగే అమెజాన్ పే ICICI క్రెడిట్ కార్డుపై రూ.3000 కంటే పైన చెల్లింపు చేసేవారికి కూడా ఇది వర్తిస్తుంది. అన్ని ప్రధాన క్రెడిట్ కార్డులపై కూడా No Cost EMI అందుబాటులో వుంది  మరియు కొన్ని ఎంపిక చేసిన డెబిట్ కార్డులకు కూడా వర్తిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo