Oppo Neo 5 రూ. 9.990 ఇండియాలో లాంచ్ అయ్యింది

Oppo Neo 5  రూ. 9.990 ఇండియాలో లాంచ్ అయ్యింది
HIGHLIGHTS

మొదటి సారి బడ్జెట్ సెగ్మెంట్ పై మార్కెట్ చేస్తుంది.

చైనా మార్కెట్ నుండి అధిక సంఖ్యలో కంపెనీలు ఇండియాలో మార్కెటింగ్ చేయటం Xiaomi బ్రాండ్ నుండి మొదలు అయ్యింది. వాటి సక్సెస్ కు కారణం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్. అయితే ఎప్పుడూ హై ఎండ్ ఫ్లాగ్ షిప్ డివైజ్ లపై మార్కెట్ చేసే Oppo కంపెని కూడా ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసింది.

ఒప్పో నియో 5 పేరుతో 9,990 రూలకు ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ లోకి వెళ్లి చుస్తే 4.5 in 854 x 480 పిక్సెల్స్ తక్కువ రిసల్యుషణ్ తో  IPS స్క్రీన్ డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ డిస్ప్లే తో వస్తుంది. ఇదే ప్రైస్ రేంజ్ లో చాలా ఫోనులు HD డిస్ప్లే లు ఇస్తున్నాయి.  ఫోన్ బ్యాక్ ప్యానల్ కూడా గ్లాస్ ఫినిషింగ్ తో వస్తుంది. మీడియా టెక్ 6582 క్వాడ్ కోర్ 1.3GHz ప్రోసెసర్, 1జిబి ర్యామ్, 8జిబి ఇంబిల్ట్ మెమరి, 32 జిబి అదనపు స్టోరేజ్ దీనిలో ఉన్నాయి. 8MP సోనీ IMX 179 BSI సెన్సార్ దీని ప్రత్యేకత. ఇలాంటి సెన్సార్ నేక్సాస్ 5 మరియు ZTE నుబియా z9 లో ఉంది. 2MP ఫ్రంట్ కెమేరా, 2000 mah బ్యాటరీ Oppo Neo 5 లో ఉన్నాయి.

అయితే Oppo కంపెని బడ్జెట్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది కాని బడ్జెట్ యూజర్స్ ను సీరియస్ గా తీసుకోలేదు. కేవలం కెమేరా ను మంచి గా ఇచ్చి మిగిలినవి అన్నీ తక్కువుగా ఇస్తే ఫోన్ సెల్ అవుతుంది అని అనుకుంది. ప్రపంచంలో తెలివైన వాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులే. అన్నీ ఫీచర్స్ మంచి ప్రైసింగ్ లో రావాలని అనుకుంటారు కాని ఇలా కంపెని గిమ్మికు లకు పడి పోయి కొనే వారు కాదని బహుశా ఈ మోడల్ ఫ్లాప్ అయిన తరువాత అయినా ఒప్పో కంపెని బడ్జెట్ యూజర్స్ కు మంచి ఫోన్ దింపుతుంది ఏమో చూద్దాం. దింపక పోయినా ఫర్వాలేదు, సామ్సంగ్ వంటి పెద్ద కంపెనీలుతో సహా చాలా కంపెనీలు బడ్జెట్ సెగ్మెంట్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి సూపర్ లేటెస్ట్ స్పెక్స్ తో నెలకు ఒక మోడల్ లాంచ్ చేస్తున్నాయి.
 

Kishore Ganesh
Digit.in
Logo
Digit.in
Logo